హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణకై చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన నాయిని..
హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన రాజ్యాంగ రక్షణ దీక్షలో హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు పాల్గొని కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలుపుతూ దీక్షకు సంఘీభావం తెలిపినారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లడుతూ…
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడిన మాటలు చాల బాధకారం.
అధికారం మదం తో కే.సి.ఆర్ ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నాడు.
అహంకారంతో మాట్లాడిన మాటలు ఇవి.
బిజేపి టి ర్ఎస్ లోపాయికార ఒప్పందంతో రాజకీయ మనుగడ కోసం జిమ్మిక్కులు చేస్తూన్నారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ మైండ్ సెట్ ను మార్చి రాజకీయ లభ్ది పొందదాని కోసం కే.సి.ఆర్ డ్రామాలు ఇక సాగవు.
ఈ రోజు కే.సి.ఆర్. నువ్వు ముఖ్యమంత్రివి ఎందుకు అయ్యావు ఎలా అయ్యావు? ఈ రాజ్యాంగం వల్లనే కదా, అలంటి రాజ్యాంగాన్ని నువ్వు మాట్లాడిన తీరు సరి కాదు.
మాల మహానాడు చేస్తున్న ఈ పోరాటానికి హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతున్నాం. మీతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.