సోనియా గాంధీ,రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెట్టి ఈడి నోటీసులు జారీ చేసి విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న జాఫర్ గఢ్ మండల కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి జాఫర్ గఢ్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది.ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు తాటికాయల రాజేందర్ మాట్లాడుతూ..మోడీ, కేసీఆర్ పోలీసులు లేకుండా ఉచ్చ కూడ పోసు కోవడానికి బయటికి రారని,పీసిసి అధ్యక్షులు తెలంగాణ పులి రేవంత్ రెడ్డి ని పోలీసు బలగాన్ని అంతా ఉపయోగించినా అడ్డుకునే దమ్ము వారికి లేదన్నారు.ఒక్కనిమిషం పోలీసులను పక్కకు జరిపితే కాంగ్రెస్ పవర్ చూపిస్తామని,మొదలు శాంతియుతంగా పోరాటం చేస్తామని,అడ్డుకుంటే యుద్దం చేస్తామని హెచ్చరించారు.అరెస్ట్ అయిన వారిలో స్టేషన్ ఘనపూర్ మాజీ మార్కేట్ చెర్మెన్ అన్నెబొయిన భిక్షపతి మాజీ జడ్పీటిసి పట్టపురి సదయ్య గౌడ్ యువజన కాంగ్రెస్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధ్యక్షులు తాటికాయల రాజేందర్ జాఫర్ గఢ్ మండల నాయకులు నంచర్ల యాదగిరిలు ఉన్నారు