జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అధ్వర్యంలో 64 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బైరి కొమురయ్య కోడలు బైరి వరలక్ష్మి గెలుపుకోసం మడికొండ యూత్ 100 మందికి పైగా యువత టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూడా దొరలకు ఊడిగం చేసే రోజులు పోవాలి. ఇంకా ఇలాంటి బానిస జీవితాలు నుండి రాష్ట్ర ప్రజలు యువత స్వాశక్తి పై ఎదగాలని సూచన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రజలకు యువతకి లబ్ధి జరిగింది ఏమీ లేదు కేవలం ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళ్తూ గెలిచాక వారిని పట్టిచుకే నాథుడే లేకుండా పోయింది.