కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం

ఈరోజున ములుగు జిల్లా కేంద్రంలోని డి.ఎల్.ఆర్.గార్డెన్స్ యందు ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ఎన్ రోలర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించగా అట్టి సమావేశానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు శాసనసభ్యురాలు దనసరి సీతక్క గారు విచ్చేసి బూతు నందు 500 కు పైగా మరియు 60 శాతానికి కంటే పైగా సభ్యత్వ నమోదు చేసిన ఎన్ రోలర్లను ఘనంగా సన్మానించడం జరిగినది.

  ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మారు మూల ప్రాంతం, అందులో అడవి ప్రాంతం అయినను కూడా ములుగు నియోజకవర్గంలో 54,000 కు పైగా డిజిటల్ సభ్యత్వ నమోదులు పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, ముఖ్యముగా ఎన్ రోలర్లకు తల వంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని అన్నారు. మన ప్రాంత ఇలవేల్పు, ఆత్మగౌరవ ప్రతీక, పోరాటానికి నాంది పలికిన సమ్మక్క- సారలమ్మ వనదేవతలను ఖించపరిచేలా మాట్లాడిన చిన జీయర్ స్వామి గారు యావత్తు తెలంగాణ ప్రజానీకానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని సభాముఖంగా తీర్మానం చేస్తున్నాం అని అన్నారు. అలాగే కుల, మత వైషమ్యాలు రెచ్చగొడుతూ దేవుడి విషయం దగ్గరి నుండి, తినే తిండి వరకు ఆంక్షలు విధిస్తూ మన దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాటలో ముఖ్యంగా రైతులు చాలా నష్టపోయారని, ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేసింది అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్తున్న బీజేపీ, తెరాస నాయకులకు డిజిటల్ సభ్యత్వ నమోదు ద్వారా 40 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు చేసి కాంగ్రెస్ ఇంకా బ్రతికే ఉందని, రాబోవు రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు అధికార పార్టీలకు చేతల ద్వారా సమాధానం ఇచ్చామని అన్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదో అనే భయంతో బీహార్ నుండి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారిని పిలిపించుకుని, ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ గారు ఆరటపడుతున్నారని అన్నారు. రాబోవు రోజుల్లో కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా మారి కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలతో పేదరిక నిర్మూలనకు కృషి చేసిందని, ముఖ్యముగా సోనియమ్మ తల్లి చేసిన మహాత్మ జాతీయ గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా కరోన కాలంలో పేదలకు అన్నం పెట్టిందని, ఉపాధి హామీ చట్టం ద్వారానే గ్రామాల్లో వైకుంఠ దామం, సీసీ రోడ్లు, రైతు భవనాలు నిర్మితమయ్యాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫీనిక్స్ పాక్షిలాంటిదని పడినట్లే అనిపిస్తుంది కానీ పడిపోదు అలాగే కాంగ్రెస్ పార్టీ రాబోవు రోజుల్లో అధికారంలోకి వస్తుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం ద్వారా యువకులు చాలా మంది వెలుగులోకి వచ్చారని, వారు అందరూ అక్కడే ఆగిపోకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఆరోగ్య శ్రీ, 104,108, ఎమర్జెన్సీ సేవలు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరా జల ప్రభ, ఫీజ్- రీయింబర్సుమెంట్, సాగునీటి ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ, పంట రుణాలు, సబ్సిడీ రుణాలు, ఎస్.సి.,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులు, మోడల్ స్కూళ్లు, సబ్సిడీ రుణాలు ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు తెలియజేస్తూ ఓటు బ్యాంకును నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ప్రతి కార్యకర్తను కోరారు. పేదలకు లబ్ది చేకూరేది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల నేస్తం అని అన్నారు.

 ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యూ.ఐ. రాష్ట్ర అధ్యక్షులు బలమూర్ వెంకట్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కూచన రవళి రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ మల్లాది రాంరెడ్డి,

ఆక రాధాకృష్ణ, టీపీసీసీ కార్యదర్శి చల్లా నారాయణ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, మత్స్య కార్మికశాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్, మహిళ అధ్యక్షురాలు కొమురం ధనలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇరసవడ్ల వెంకన్న, జడ్పీటీసీలు కరంచంద్ గాంధీ, పులుసం పుష్పలత- శ్రీనివాస్, ఈసం రమ- సురేష్, ఎంపీపీలు విజయ- రూప్ సింగ్, సువర్ణపాక సరోజన, జనగం సమ్మక్క, మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, జాలపు అనంతరెడ్డి, చిటమట రఘు, మైల జయరాం రెడ్డి,ఎండీ ఆప్సర్ పాషా
వర్కింగ్ ప్రెసిడెంట్లు రసపుత్ సీతారాంనాయక్, బండి శ్రీనివాస్, సుంకరబోయిన మొగిలి, సహకార సంఘం అధ్యక్షులు బొక్క సత్తిరెడ్డి, పులి సంపత్, పన్నాల ఎల్లారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ మండలాల అనుబంధ సంఘాల అధ్యక్షులు,ఉపాధ్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ రోలర్లు
సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, ఎన్ రోలర్లు మరియు సీతక్క అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.