భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని రేగొండ మండలం జగ్గయ్య పల్లి,రామగుండాలపల్లి, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల,ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్య నారాయణ రావు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సైనికులుగా పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య,గోటోజు కిష్టయ్య,బిక్షపతి,జిల్లా కార్యవర్గ సభ్యులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.