కృష్ణాజిల్లా÷ నందిగామ
హైవే నిర్మాణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి మరెన్ని ప్రాణాలకు తావు తీస్తుందో..
హైవే పనులు అయిన వెంటనే అక్కడ ఉన్న వ్యర్థం తొలగించక పోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు
పాత కాకతీయ రెస్టారెంట్ వద్ద జాతీయ రహదారి పై లోడుతో వెళ్తున్న లారీ రోడ్డుకు అడ్డంగా ఉన్న మట్టి కుప్ప వల్ల బోల్తా
లారీ నుంచి కిందకు దిగిన డ్రైవర్
ప్రమాదం జరిగిన పరిస్థితిని లారీ ప్రక్కకు నిలబడి చూస్తుండగా మరో డీసీఎం కంటైనర్ వ్యాను లారీని ఢీ కొనడంతో రెండు లారీల మధ్యలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి
రెండు వాహనాల మధ్య లో చిక్కుకున్న లారీ డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు
ఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు