కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే బొడ


బొడ సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలి
బొడ సునీల్ మృతికి సంతాపం గా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యములో కొవ్వత్తుల రాలి
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో బో డ సునీల్ మృతికి సంతాపం గా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బనోత్ రవి చందర్ ఆధ్వర్యములో కొవ్వత్తుల ర్యాలీ
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి గారు మాట్లాడుతూ
నీళ్లు,నిధులు,నియామకాలు అనే నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమం 1200 వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రంలో నీళ్లు,నిధులు రాలేదని, నియమాలు అయినా వస్తాయని ఆశపడ్డ విద్యార్థులు ఆశలు అడియాశలు అవుతున్నాయని ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ఉద్యోగుల వయసును 61 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేవని,రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో చిక్కుకొని ఉద్యోగాలు లేక, కోచింగ్ సెంటర్ లో పెట్టిన అప్పులు తీర్చలేక, ప్రభుత్వం నుండి ఉద్యోగాల భర్తీ కోసం ఒక లక్ష ఏడు వెయ్యిల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి గత 7సంవత్సరాలనుండి ఒక్క నోటిఫికేషన్ కూడ ఇవ్వలేదని అటువంటి సందర్భంలో బ్రతుకు భారమై, తన బలిదానంతో ఐనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆత్మహత్యాయత్నం చేసిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి, ఉద్యమకెరటం ఉద్యోగాల పోరులో అసువులు బాసిన సునీల్ నాయక్ కు జోహార్లు తెలియజేస్తూ……..
ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిస్తున్నాం..
రాష్ట్రము కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, లాఠీ దెబ్బలను తిని కొట్లాడింది విద్యార్థులని ఈరోజు కేవలం KCR కుటుంబం మాత్రమే బాగుందని, వాళ్ళ కుటుంబానికి మాత్రమే పదవులు దక్కించుకున్నారని, కేవలం వాళ్ళ స్వార్థం కోసమే పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
సునీల్ నాయక్ మరణానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కుటుంబానికి 50లక్షలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ….
సునీల్ నాయక్ బలిదానం సాక్షిగా రాష్ట్రములో అమరుల ఆశయాల సాధనకు మరో పోరాటానికి సిద్ధమవుదామని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంబాల రవి
రేవంత్ యాదవ్,అశోక్ గౌడ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,సర్పంచ్ భద్రయ్య,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు,చంద్,
వంశీ,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,మేడం రమణ కర్
దేవ్ సింగ్, బోల్లం రవి,శ్రీధర్,రవి
రాహుల్,రాజేందర్,తారక్,శ్రీకాంత్
రాజు,శివ,శ్రీను,శ్రీధర్,సంత్,శరత్
సుధాకర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.