kazipeat news

అక్రమ బదిలీలను ఆపాలని, కాజిపేట రైల్వే క్రూ కంట్రోల్ కార్యాలయం ముందు గత 10 రోజులు గా రైల్వే డ్రైవర్ లు, గార్డ్ లు, తమ కుటుంబాలతో న్యాయ పోరాటం చేస్తూ నిరసన లు, ధర్నా లు చేసి, రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారికి నేడు (11-07-2022) 6 వ రోజు దీక్షలను నిమ్మరసం ఇచ్చి, నేటి దీక్ష ను విరమింపచేసిన హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు.

ఈ సందర్బంగా నాయిని రాజేందర్ రెడ్డి గారు దీక్షలు చేస్తున్న రైల్వే డ్రైవర్ లు, గార్డ్ లతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు ఎంపీ శ్రీ. రేవంత్ రెడ్డి గారి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, ఎంపీ శ్రీ. మాణిక్ ఠాకూర్ గారి దృష్టికి తీసుకువెళ్లానని, మీ సమస్యను జీఎం, డీ.ఆర్.యం లతో మాట్లాడారని, అలాగే వచ్చే వారం పార్లమెంట్ సమావేశాలలో ఈ సమస్యను శాశ్వత పరిష్కారానికై మాట్లాడ్తామన్నారని తెలియచేసారు.
అదేవిధంగా మీ సమస్యలపై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

ఈ సందర్బంగా నాయిని రాజేందర్ రెడ్డి గారు విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ-టీఅర్ఎస్ నాయకులు రాజకీయాలకోసమే వేషాలు వేస్తూ ప్రజలను, సమస్యలను, ఉద్యమాలను నీరుకార్చేవిధంగా చేస్తున్నారని, కాజిపేట్ ప్రాంతాన్ని వెనుకబాటుకు గురిచేశారని, 8 ఏండ్ల కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వల నిర్లక్ష్యమే నిదర్శనమని అన్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాజిపేట రైల్వే క్రూ లింక్ ల సాధనకోసం, కాజిపేట్ రైల్వే డివిజన్ సాధనకోసం, రాష్ట్ర విభజన చట్టం లో ఉన్న కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకోసం, రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ & రిపేర్ యూనిట్ సాధకోసం, కాజిపేట్ రైల్వే పిరియాడికల్ ఓవరాయిలింగ్ వర్కుషాప్ సాధనకోసం, కాజిపేట్ రైల్వే జంక్షన్ అభివృద్ధి కోసం ఉద్ద్యమ నిర్మాణం చేయబోతున్నామని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకూస్, అరూరి సాంబయ్య, ఇప్ప శ్రీకాంత్, పాలడుగుల ఆంజనేయులు, ఎంవీ సమత రాజు, ఎస్కే అజ్గర్, పోగుల సంతోష్, దోమ లింగారెడ్డి, మహమ్మద్ అయూబ్, అంబేద్కర్ రాజు, కొండా శివ, క్రాంతి భారత్, అరూరి సందీప్, ఎండి అఫ్జల్ పాల్గొన్నారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.