revanth reddy railway news

కాజిపేట నుండి విజయవాడ కు తరలిస్తున్న రైల్వే క్రూ లింక్ లను నిలిపి వెయ్యాలని, అక్రమ బదిలీలను ఆపాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లిన నాయిని రాజేందర్ రెడ్డి…

కాజిపేట జంక్షన్ రైల్వే క్రూ లింక్ లను విజయవాడ కు తరలింపు జి.ఓ ను వెంటనే రద్దు చేయించాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ ఠాకూర్ గారికి గాంధీ భవన్ లో నేడు హన్మకొండ & వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

కాజిపేట రైల్వే క్రూ కంట్రోల్ కార్యాలయం ముందు గత 10 రోజులు గా రైల్వే డ్రైవర్ లు, గార్డ్ లు, తమ కుటుంబాలతో న్యాయ పోరాటం చేస్తూ నిరసన లు, ధర్నా లు చేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిన్న (08 -07 -2022) కాజిపేట రైల్వే క్రూ కంట్రోల్ కార్యాలయం కు వెళ్లి వారిని కలిసి వారు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలియజేసానని, కాజిపేట లో రైల్వే డ్రైవర్ లు, గార్డ్ లు, గత 20 ఏండ్ల నుండి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, గతం లో కూడా వీరి సమస్య పై పోరాటాలు చేస్తే తాత్కాలిక ఉపశమనం చేసారే తప్ప శాశ్వత పరిష్కారం జరగలేదని గత 3 నెలల నుండి కాజిపేట రైల్వే డ్రైవర్ లు, గార్డ్ లను ప్రమోషన్ ల పేరుతో సికింద్రాబాద్ తదితర ప్రాతాలకు బదిలీలు చేస్తున్నారని, 3 క్రూ లింక్ లను విజయవాడ కు తరలించారని అంతర్గత కుట్రతో కాజిపేట రైల్వే జంక్షన్ పై ఈ విధంగా పలు రైల్వే విభాగాలను తరలిస్తున్నారని కాజిపేట రైల్వే జంక్షన్ ను ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రం చెయ్యాలని డిమాండ్ ను త్రొక్కి పెట్టె ఆలోచన తో ఉన్నత అధికారులు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి నాయిని రాజేందర్ రెడ్డి గారు వివరించారు.

కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏండ్ల కళను తెలంగాణ రాష్ట్రమిస్తే నిరుద్యోగ సమస్య పెరుగుతుందని ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించినప్పుడు పెద్ద మనసుతో శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వాలు వచ్చినా రాష్ట్రం విభజించిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఆరు నెలల్లో పనులు ప్రారంభించాలని చట్టం చేయబడి ఉన్నదని గత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాజిపేట రైల్వే జంక్షన్ కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ & రిపేర్ యూనిట్ రైల్వే పరిశ్రమ ఇవ్వడం జరిగింది అని ఈ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కి కాజిపేట మడికొండ మెట్టు రామలింగేశ్వర ఆలయానికి చెందిన 54 ఎకరాలు దేవాదాయశాఖ భూమిని నాటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య కేటాయించి 18 కోట్ల రూపాయిలు నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేసారని, ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ శంకుస్థాపన తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుతో వచ్చిన ఎన్నికల సందర్బంగా వాయిదా పడిందని ఎన్నికల అనంతరం శంకుస్థాపన చేయాల్సిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని వివరించారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, రాష్ట్ర విభజన చట్టం లో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లను తొక్కి పెట్టాయని అదే విధంగా కాజిపేట రైల్వే జంక్షన్ ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రం చేయాలనే డిమాండ్ ను కాలరాసే విధంగా ఈ అక్రమ బదిలీలు చేస్తున్నారని తెలియజేసారు.

పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాజిపేట రైల్వే జంక్షన్ కు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించండి అని కాజిపేట రైల్వే క్రూ డిపో నుండి క్రూ లింక్ లను నిలిపి వెయ్యాలని అక్రమ బదిలీలను నిలిపివేయాలని, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజిపేట రైల్వే డివిజన్ కేంద్రం కొరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ నిర్మాణం చేయండని హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి కి ఆదేశాలు ఇచ్చారని ఈ కాజిపేట రైల్వే క్రూ కంట్రోల్ విషయం పై రైల్వే ఉన్నత అధికారులు GM & DRM ల దృష్టికి తీసుక వెళ్తానని శాశ్వత పరిష్కారం చేస్తానని తెలియజేసారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.