కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం వరంగల్ జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ - జంగా

అన్ని పార్టీలను సమీకరణం చేసి జెఎసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతున్న డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి రావాల్సిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మరియు కాజీపేట రైల్వే డివిజన్ గిరిజన యూనివర్సిటీ లాంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే ప్రాజెక్టులను రాకుండా బిజెపి ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయ లబ్ది కోసం తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ప్రజల త్యాగాలు వృధా కాకూడదని రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం వారి చిరకాల ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాదాపు రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది. ఇలాంటి ఉపాధి కలిగించే ప్రాజెక్టులను గాలికి వదిలేసి దేశాన్ని రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యవస్థగా మార్చేస్తుంది.
టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్‌లో కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ గురించి కేంద్రాన్ని ప్రశ్నించిన కానీ ఎటువంటి సమాధానం ఇవ్వని కేంద్ర ప్రభుత్వం పై సిగ్గుచేటుగా భావిస్తున్నాను జంగా
రాష్ట్ర ప్రజలారా నిరుద్యోగ యువత లారా మేల్కొండి బిజెపి ప్రభుత్వం వచ్చి చేసిందేమీ లేదు70 ఏళ్ల నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రైవేట్ సంస్థలను ప్రభుత్వ సంస్థ గా మార్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంటే, బిజెపి ప్రభుత్వం మాత్రం ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ రోడ్డు రైల్వే స్టీల్ ప్లాంట్ ఇలాంటి ఎన్నో దేశాన్ని అభివృద్ధి చేసే సంస్థలను ప్రవేట్ పరం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మరియు గిరిజన యూనివర్సిటీ లాంటి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే సంస్థలన్నింటినీ సాధించేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది -జంగా రాఘవరెడ్డి
రాష్ట విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలి – జంగా రాఘవరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కోచ్‌ ఫ్యాక్టరీ సాధన కోసం దేనికైనా సిద్ధమన్నారు.
కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ 20 ఏళ్ల కల అని, కోచ్‌ ఫ్యాక్టరీ కోసం వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ కేటాయించాలని విభజన చట్టంలోనే ఉందన్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. బీజేపీ, టిఆర్ఎస్ అబద్దాల పునాదులపై అధికారం కోసం అర్రులు చాస్తోంది.
సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీ ఉంటేనే తెలంగాణ సాధించుకున్నాము అని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు పది మంది ఎంపీలు ఉన్నారు.టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు సంవత్సరాల దాటుతుంది.ఏ రోజు కూడా పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని ప్రశ్నించలేదు.
కోచ్‌ ఫ్యాక్టరీతో పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, కేంద్రం మోసం చేసిందన్నారు జంగా.
గిరిజన యూనివర్సిటీ కోసం 600 ఎకరాలు సేకరించినా, ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని ఇది గిరిజనులకు తీవ్ర ద్రోహం చేయడమే అన్నారు.
తెలంగాణలోని బీజేపీ & టిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే కేంద్రంతో పోరాడి కోచ్‌ ఫ్యాక్టరీ తీసుకురావాలని సవాల్‌ చేసారు.
రైలు డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ మాకొద్దని, కోచ్‌ ఫ్యాక్టరీ కావాలని డిమాండ్‌ చేశారు.
కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే 150 ఎకరాలు సేకరించామని, అయితే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు జంగా.
బీజేపీ అంటే భారతీయ బొంకుడుపార్టీ అని తేలిపోయిందని జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి  చెప్పారు.
తక్షణమే దీనిమీద స్పందించి ఆరునెలల్లోపు కోచ్ ఫ్యాక్టరీని నిర్మించాలని ఈ కోచ్ ఫ్యాక్టరీకోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మద్దతుగా ఉంటారని ఈ సందర్బంగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి తెలియజేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.