రాష్ట్ర ప్రభుత్వమే కారణమని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి

సునీల్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణము : జంగా రాఘవరెడ్డి

నిరుద్యోగి బోడ సునీల్ ఆత్మహత్యకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో చేస్తున్న మోసాలను అరికట్టాల్సిన సమయం వచ్చిందని సెల్ఫీ వీడియో టేపులను పొందుపర్చుతూ ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం కాజీపేట్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జంగా రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ నాడు విద్యార్థి బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ, నేడు గడీల పాలన అయిందని, విద్యార్థులు త్యాగాలు చేస్తే, భోగాలు కెసిఆర్ కుటుంబం అనుభవిస్తుందన్నారు.విద్యార్థి బోడా సునీల్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా బలిదానాలు ఉండవని చెప్పిన కేసీఆర్ నేడు నిరుద్యోగులను నట్టేట ముంచారని విమర్శించారు. అలాగే ఏ
విద్యార్థి కూడా బలిదానం కావద్దని, పోరాటాల ద్వారా మన హక్కులను సాధించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కుచన రవళి గారు మాజీ కార్పొరేటర్ జక్కుల రమ రవీందర్ యాదవ్ గారు తోట్ల రాజు గారు లింగం మౌనిక చరణ్ రెడ్డి గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ రజాలీ గారు గుర్రపు కోటేశ్వర్ గారు బోయిని కుమార్ యాదవ్ గారు కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థి శంకర్ గారు pacs డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారు డివిజన్ ప్రెసిడెంట్ లు సంధ్యలా విజయ్ కుమార్ గారు మహమూద్ గారు ధర్మసాగర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఆదిరాల సత్యం బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసర్ల నగేశ్ గారు సత్య వరం మధుకర్ కిషన్ స్వామి బండి రాజు మహేందర్ రెడ్డి దాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.