• అఐటిపాములలో ఘనంగా ఆరో వర్ధంతి వేడుకలు

కట్టంగూర్, ఏప్రిల్ 4: సిమీ ఉగ్రవాదులను పట్టుబడి చేసేందుకు పోరాడి ప్రాణ త్యాగం చేసిన పోలీస్ కానిస్టేబుల్ చేగొని నాగరాజు అజరామరుడని, దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయన త్యాగం చిరస్మరణీయమని శాలిగౌరారం సిఐ పసుపులేటి నాగ దుర్గా ప్రసాద్ అన్నారు. మోత్కూరు మండలం జానకిపురం వద్ద సినీ ఉగ్రవాదుల దాడిలో అమరుడైన పోలీస్ కానిస్టేబుల్ చేగొని నాగరాజు ఆరో వర్ధంతి వేడుకలను నాగరాజు స్వగ్రామమైన మండలంలోని ఐటి పాముల గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు విగ్రహానికి సీఐ తో పాటు పోలీస్ సిబ్బంది పలువురు గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆత్మకూరు ఎం పోలీస్ స్టేషన్లో కానిస్టేబులుగా పని చేస్తూ సూర్యాపేట హైటెక్ బస్టాండ్లలో పోలీసులపై కాల్పులు జరిపి పరారైన సిమీ ఉగ్రవాదులను పట్టుకునేందుకు తెగువ చూపి కానిస్టేబుల్ నాగరాజు చిరుప్రాయంలోనే దేశం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. కట్టంగూర్ ఎస్ఐ బత్తుల శివప్రసాద్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన నాగరాజు స్మారకార్థం గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు ప్రతియేటా పలు కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయక మన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన నాగరాజు జీవితాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివంగత పోలీస్ కానిస్టేబుల్ నాగరాజు తండ్రి శ్రీమన్నారాయణ, గ్రామ పెద్దలు చుక్కయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కానిస్టేబుల్ నాగరాజు ప్రాణత్యాగం అజరామరం * అఐటిపాములలో ఘనంగా ఆరో వర్ధంతి వేడుకలు కట్టంగూర్, ఏప్రిల్ 4: సిమీ ఉగ్రవాదులను పట్టుబడి చేసేందుకు పోరాడి ప్రాణ త్యాగం చేసిన పోలీస్ కానిస్టేబుల్ చేగొని నాగరాజు అజరామరుడని, దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయన త్యాగం చిరస్మరణీయమని శాలిగౌరారం సిఐ పసుపులేటి నాగ దుర్గా ప్రసాద్ అన్నారు. మోత్కూరు మండలం జానకిపురం వద్ద సినీ ఉగ్రవాదుల దాడిలో అమరుడైన పోలీస్ కానిస్టేబుల్ చేగొని నాగరాజు ఆరో వర్ధంతి వేడుకలను నాగరాజు స్వగ్రామమైన మండలంలోని ఐటి పాముల గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు విగ్రహానికి సీఐ తో పాటు పోలీస్ సిబ్బంది పలువురు గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆత్మకూరు ఎం పోలీస్ స్టేషన్లో కానిస్టేబులుగా పని చేస్తూ సూర్యాపేట హైటెక్ బస్టాండ్లలో పోలీసులపై కాల్పులు జరిపి పరారైన సిమీ ఉగ్రవాదులను పట్టుకునేందుకు తెగువ చూపి కానిస్టేబుల్ నాగరాజు చిరుప్రాయంలోనే దేశం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. కట్టంగూర్ ఎస్ఐ బత్తుల శివప్రసాద్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన నాగరాజు స్మారకార్థం గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు ప్రతియేటా పలు కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయక మన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన నాగరాజు జీవితాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివంగత పోలీస్ కానిస్టేబుల్ నాగరాజు తండ్రి శ్రీమన్నారాయణ, గ్రామ పెద్దలు చుక్కయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.