కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం - PDSU

ఉస్మానియా అరుణతార , హైదరాబాద్ చేగువేర , ఇండియన్ ఐన్ స్టీన్ కామ్రేడ్ . జార్జిరెడ్డి 50 వ వర్ధంతి సభల సంధర్భంగా PDSU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జార్జి రెడ్డి సదస్సు సూర్యపేట జిల్లా నాగరం మండలం పసునూర్ మోడల్ స్కూల్ నిర్వహించి తన చిత్ర పటానికి పులా మాల వేసి నివాళ్ళు అర్పిండమం జరిగింది . జార్జి రెడ్డి ఆశయ సాధన కోసం , సమసమాజ స్థాపన కోసం , విద్యారంగ సమస్యల పరిస్కారం కోసం జార్జి అందించిన స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. అలాగే ఏప్రిల్ 14 తేదీన హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగే మార్నింగ్ వాక్ ను , జార్జి రెడ్డి 50 వ వర్ధంతి సభ జరుగుతుంది ఈ సభకు విద్యార్థులు , యువకులు , జార్జిరెడ్డి అభిమానులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్, మోడల్ స్కూల్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యకమల్లు, aiKMs జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, PDSU సూర్యపేట జిల్లా అధ్యక్షుడు పోలేబొయిన కిరణ్, అరుణోదయ జిల్లా నాయకులు తడకమల్ల సంజీవ్, PDSU జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల సుధాకర్, ఉపాధ్యాయులు కార్తిక్ , శ్రవ్య శిరిషా, వాణి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.