సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ
సభ్యులు ఎండి అబ్బాస్
(స్టే)ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో రాత్రి జరిగిన ఇప్పగూడెం దివంగత సర్పంచ్ మంతెన అజయ్ రెడ్డి ప్రధమ వర్ధంతి సభ జరిగింది. ఈ సభకు గట్ల మల్లారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎండి అబ్బాస్ హాజరై మాట్లాడారు. అజయ్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తామని గ్రామ అభివృద్ధిలో సిపిఎం పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తుందని, అవినీతి లేని సమాజం కోసం పోరాటం చేస్తుందని అన్నారు. నేడు దేశంలో రాష్ట్రంలో అవినీతికి అంతే లేకుండా పోయిందని, ధనవంతుడు ఇంకా ధనవంతుడుగా అవుతున్నాడాని పేదవాడు ఇంకా పేదవాడిగానే మారుతున్నాడు అన్నారు. రాజకీయాలు బ్రష్టు పట్టి పోయాయని ఎమ్మెల్యేలను సంతల్లో పశువులుగా కొన్ని ప్రభుత్వాలు నడుపుతున్నారని అన్నారు. విలువలు లేని ప్రజాప్రతినిధులుగా తయారవుతున్నారని ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అది కమ్యూనిస్టులతోటే సాధ్యమని అన్నారు. సమాజాన్ని మార్చాలన్న ఆలోచన పేద ధనిక తేడా అనే ఈ అంతరాలు లేని సమాజం కోసం అజయ్ రెడ్డి పోరాటం చేశారని వారు అన్నారు. ఇప్పగూడెం గ్రామానికి సర్పంచ్ గా రెండేళ్లే చేసిన ప్రజల మన్ననలు పొంది నీతి, నిజాయితీగా గ్రామ అభివృద్ధికి పాటు పడ్డాడని ప్రజల గుండెల్లో నిలిచాడని ఎన్నటికీ అజయ్ రెడ్డిని ప్రజలు మర్చిపోరని అన్నారు. వారి ఆశయ సాధన కోసం సిపిఎం ఎల్లవేళలా పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఈ సభలో వివిధ పార్టీల నాయకులు మాట్లాడారు. అజయ్ రెడ్డి గొప్పదనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరు వెంట్రాజం, ఇర్రి అహల్య, సింగారపు రమేష్, మండల కార్యదర్శి మునిగెల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు భూక్య చందు, గ్రామ ఎంపీటీసీ గండి విజయలక్ష్మి, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి మహబూబ్ పాషా, ఉప సర్పంచ్ పోకల లక్ష్మీ నరసయ్య, టిఆర్ఎస్ పార్టీల నాయకులు సట్ల యాకయ్య, మందపురం సతీష్ సిపిఎం మండల కమిటీ సభ్యులు కుర్ర ఉప్పలయ్య, మంద మహేందర్, దైద రాములమ్మ, పోలాస్ పరమేష్, గ్రామ శాఖ కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కళాకారులు అజయ్ రెడ్డి గారి పైన పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
