ఈ69న్యూస్ తమ్మడపల్లి జి/జఫర్ ఘడ్/మార్చి15
కామ్రేడ్ రహ్మతుల్లాహ్ (65)13 జనవరి 2022 రోజున అనారోగ్యంతో మరణించగా ఈ రోజు వారి స్వంత గ్రామం తమ్మడపల్లి (జి)లో సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి గుండెబోయిన రాజు అధ్యక్షతన కామ్రేడ్ రహ్మతుల్లాహ్ సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు ముహమ్మద్ అబ్బాస్,జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనుకారెడ్డి,జనగామ జిల్లా సిఐటియు కార్యదర్శి రాపర్తి రాజు,హైదరాబాద్ జిల్లా కార్యదర్శి రాపర్తి అశోక్,జఫర్ఘడ్ మండల కార్యదర్శి రాపర్తి సోమయ్యలు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ముహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ కామ్రేడ్ రహ్మతుల్లాహ్ నిరక్షరాస్యుడైనను ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో తిరిగి ప్రజలను ఏకం చేసి బుర్రకథల రూపంలో ప్రచారం చేసి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని,వారిని ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.అమరవీరులకు జోహార్లు,అమరవీరుల ఆశయాలను సాదిస్తాం అని నినదించారు. అనంతరం కామ్రేడ్ రహ్మతుల్లాహ్ కుటుంబ సభ్యులను శాలువలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఉప్పునూతుల మల్లయ్య, సోమయ్య,రాపర్తి మల్లేశం,నాగయ్య, రవి, యాకయ్య,షంషోద్దీన్, , బాషా, యాకూబ్, సుధాకర్, ప్రభాకర్,షబానా సొప్పరి వెంకటమ్మ,రోజా,యాకూబీ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
కామ్రేడ్ రహ్మతుల్లాహ్ సంస్మరణ సభలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యుడు-ముహమ్మద్ అబ్బాస్
