#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

సంపన్నులకు రాయితీలు, సంక్షేమానికి కోతలు పెట్టడం సిగ్గు చేటు

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా ..ఏవో కి వినతి

కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్‌ పేదలను పూర్తిగా విస్మరించిందని, ఈ బడ్జెట్లో సంపన్నులకు రాయితీలు, సంక్షేమానికి కోతలు పెట్టడం సిగ్గు చేటని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లికార్జున్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, రైతు, వ్యకస, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ రైతులు, కూలీలు, పేద, మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంక్షేమ రంగానికి నిధులు కేటాయించకుండా పూర్తిగా కోతలు పెట్టిందని పేర్కొందన్నారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల రక్షణ కోసం రాయితీలు ప్రకటించిందనీ, ప్రాధాన్యతా రంగాలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. దేశంలోని సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు వీలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌ను రూపొందించిందన్నారు. ఉపాధి కూలీలకు, అంగన్‌వాడీలకు, ఆహార భద్రత, ప్రభుత్వ రంగ సంస్థలకు బడ్జెట్‌ను భారీగా తగ్గించిందన్నారు. ప్రజలంటే, అదానీ, అంబానీ, బహుళ జాతి కంపెనీలే అన్నట్టు బీజేపీ భావిస్తున్నదని విమర్శించారు. అందుకే వారికి భారీగా పన్నులు తగ్గించిందని చెప్పారు. రూ 12 లక్షల కోట్ల విలువైన దేశ సంపదను వారికి కట్టబెట్టేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించేందుకు వీలుగా వాటికి ఆదాయాన్ని తగ్గించిందన్నారు. దీంతో రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ సంపన్నులకు పుష్కలంగా రాయితీలు కల్పించి, ప్రజా సంక్షేమ నిధుల్లో కోత పెట్టిందని విమర్శించారు.
అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ వ్యవసాయం, రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర బడ్జెట్‌ విస్మరించిందని తెలిపారు. కరోనా సమయంలో పేదలను ఆదుకున్న ఉపాధి చట్టానికి నిధులు తగ్గించి, వారి పొట్టకొట్టిందని చెప్పారు. ఉపాధి కూలీలకు 200 రోజుల పనిదినాలు, రూ 600 కూలీ ఇచ్చేదాక పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులూ రాజయ్య, మాణిక్, సాయిలు, నర్సింహారెడ్డి, యాదగిరి, నర్సిములు, బాగారెడ్డి, అశోక్, వరలక్ష్మీ, ప్రసన్న, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.