కార్పొరేట్ శక్తులకు అనుకూలం చట్టాలను వెంటనే రద్దుచేయాలి


–పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్.


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేసి, విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. శనివారం రొిజున నల్గొండ మండల పరిదిలోని చందనపల్లీ గ్రామంలో సిపిఎం రాష్ట్ర కమిటి పిలుపు మేరకు డిల్లీ రైతాంగ పోరాటానికి చందనపల్లీ రైతులు మద్దతు గా నిలిచారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ రైతులు,కూలీలు,మహిళలు గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున పాల్గొని మాట్లాడుతూ కార్పొరేటు అనుకూల 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు నిర్వహిస్తుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఇది రైతుల ప్రభుత్వం కాదు కార్పొరేట్ శక్తులకు,బడాపెట్టుబడిదారులకు, భూస్వాములకు ఊడిగం చేసి ప్రభుత్వంగా ఉన్నదని విమర్శించారు.
స్వేచ్ఛా మార్కెట్ పేరుతో వచ్చిన చట్టం గాని, కాంట్రాక్ట్ వ్యవసాయం చట్టం గానీ రైతులకు ఏ మాత్రం మేలు చేయకపోగా మరింత నష్టం చేస్తాయని కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయంలోకి, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లలోకి చొరబడి రైతాంగం నుండి కారుచౌకగా కొనుగోలు చేసి వినియోగదారులకు అధిక ధరకు అమ్ముకుని లాభాలు గడించుకునేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని అన్నారు. నిత్యావసర వస్తువుల నియంత్రణ సవరణ చట్టం మొత్తం భారత ప్రజానీకానికి వ్యతిరేకమైనదని ఈ చట్ట సవరణ స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు ఉపయోగపడుతుందని ఆవేదన వెలిబుచ్చారు. 2013లో వచ్చిన ఆహార భద్రత చట్టాన్నికి తూట్లు పొడుస్తుందని ఇప్పటికైనా ఈ నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసినారు.

      విద్యుత్ సవరణ బిల్లు వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తు దూరం చేస్తుందని, ముఖ్యంగా మనరాష్ట్రంలో 25 లక్షల బోరుబావులతో వ్యవసాయం నడుస్తుందని వీరందరికీ ఉచిత విద్యుత్ లేకుండా పోతుందని ఫలితంగా రైతులపై మరింత భారం పడి వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితులు వస్తాయని వీటిని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని కోరినారు. రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం కూడా మోడీ విధానాలను, చట్టాలను అమలు చేస్తానని అనడం చాలా దారుణమని మోడీ మాయలో పడకుండా రాష్ట్రంలో రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు కోసం  ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం జరిపి  తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ,ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండా అనురాధ, చందనపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు రూపానీ వెంకటమ్మ ,ఐద్వా మండల అద్యక్షురాలు వార్ధు సభ్యులు తంతెనపల్లి సైదమ్మ, సిపిఎం సీనియర్ నాయకులు జంజరాల ఇస్తారి ,చందనపల్లి రైతులు నాయకులు  దోమలపల్లి అంజయ్య, కొడదల లింగయ్య, రూపని వెంకులు ,మద్దెల లింగయ్య, మెురుగు రాములు , కాసిమల్ల రాములు , రూపని బిచ్చం ' లక్ష్మమ్మ ,మణెమ్మ  , తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.