కార్పోరేటర్ వస్కుల శంకర్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశా

(19/02/2021)ఈరోజు కాజిపేట మండలం మడికొండ ముప్పై నాలుగు వ డివిజన్ పోటీ చేసిన అభ్యర్థి కార్పోరేటర్ వస్కుల శంకర్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి గారు
జంగా రాఘవరెడ్డి గారి కామెంట్స్:ఈ రోజు సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
రాబోయే కార్పోరేటర్ ఎలక్షన్ ల సందర్భంగా బూతుల వారిగా బూతు కు ఇరవై అయిదు మంది చొప్పున కమిటీ వేసుకోవాలని ఆ కమిటీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
దానితోపాటు డివిజన్ కు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కమిటీలు కూడా వేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గారి గెలుపు కోసం కృషి చేయాలని తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర విద్యార్థులకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఈ సందర్బంగా తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు పూర్తి చేయని ఘనత సిఎం కెసిఆర్ గారిది.
కాబట్టి కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గానీ మన బ్రతుకులు మారవు మన బతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీ చేతిగుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రైతులను పోలీసు బృందంతో చితకబాదేస్తుంది.
బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు పలుకుతుంది.
కాబట్టి ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ చేతుగుర్తుకు ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి.
ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగు వ డివిజన్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.