కార్పోరేట్ దోపిడీదారులైన అంబానీ ఆదానీ ఉత్పత్తుల దగ్ధం

…..ప్రజా సంఘాలు
కార్పోరేట్ పెట్టుబడిదారులు దోపిడీదారులైన అంబానీ ఆదానీ ఉత్పత్తుల jio,fortune ఇతర వస్తువులను నుంచి బహిష్కరించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కుాన్ రెడ్డి నాగిరెడ్డి కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.కేంద్ర ప్రజా సంఘాల పిలుపు మేరకు ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం దగ్గర అంబానీ jio ఆదాని fortune ఉత్పత్తులను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలైన యల్ ఐసి బీఎస్ఎన్ఎల్ రైల్వే ఎయిర్ఫోర్స్ బ్యాంకింగ్ అన్నీ ప్రైవేటు పరం చేయడం జరిగిందని అన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిన మోడీ రైతుల ఉత్పత్తులను కారుచౌకగా పెట్టుబడిదారులు దోపిడీ చేయడానికి బార్లా తలుపులు తీశాడని అన్నారు.విద్యుత్ సంస్కరణల పేరా తెలంగాణలో ఉచిత విద్యుత్తు లేకుండా చేసే కుట్రలు సాగుతున్నాయని అన్నారు.రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రైతు చట్టాలు విద్యుత్తు సంస్కరణల వలన ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉండవని అన్నారు.కార్పొరేట్ వ్యవసాయం పేరా రైతుల భూములు గుంజుకుంటున్నారని అన్నారు.దేశవ్యాప్తంగా రైతులు పలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కానీ మంత్రులు పార్లమెంటు సభ్యులు కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు.రేపు 14 నుండి నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేయనున్నట్లు తెలిపారు.ప్రజలు రైతాంగ ఉద్యమాలకు పెద్ద ఎత్తున కదలి రావాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలు విద్యుత్తు సంస్కరణలు రద్దయ్యే వరకు పోరాడుతామని తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందాల ప్రమీల ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్.dyfi జిల్లా ఉపాధ్యక్షుడు కోట్ల అశోకరెడ్డి. కుర్ర శంకర్నాయక్ గిరిజన సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి గుండాల నరేష్ డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఐద్వా పట్టణ అధ్యక్షురాలు కనుకుంట్ల ఉమా రాణి పట్టణ కార్యదర్శి భూతం అరుణ కుమారి యువజన సంఘం నాయకులు శ్రావణ్ కరుణాకర్ నాగరాజు మధు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.