#suryapetnews #trsnews

శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

ఈరోజు సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డు చిన్న కమిటీ హాల్ సమీపంలో, పోస్ట్ ఆఫీస్ మసీద్ సమీపంలో ఆటో యూనియన్ మరియు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో మే డే కార్మికుల దినోత్సవ సందర్భంగా కార్మికులు నిర్వహించిన జెండాను ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ఈ సందర్భంగా కార్మికుల అందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికుల కష్టాన్ని చూసి మూడు సార్లు జీత వేతనాలను పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారితో పాటు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి దక్కుతుంది అని అన్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ కార్మికుల అందరికీ పెంచిన వేతనాల కు సంబంధించిన ఏడు వేల ఏరియల్స్ మే డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఎకౌంట్లో 25 వేల రూపాయలు జమ చేసి కార్మికులు ఆనందం నింపిన ఘనత మంత్రి గారిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భారత్ మహాన్, టిఆర్ఎస్ కెవి మున్సిపల్ యూనియన్ సలహాదారులు ఆకుల లవకుశ, టిఆర్ఎస్ నాయకులు కొండపల్లి దిలీప్,నీలాల లక్ష్మయ్య, టిఆర్ఎస్ కెవి మున్సిపల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లి కృష్ణ, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సోమయ్య, ప్రధాన కార్యదర్శి బిక్షం,9వ వార్డ్ అధ్యక్షులు గుండగాని నాగభూషణం, కార్మిక విభాగం అధ్యక్షుడు అనుములపూరి నాగయ్య, యూత్ అధ్యక్షులు మచ్చ రాము, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.