plknews maydaynews telugunews

మేడే స్ఫూర్తితో హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలి

సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి సింగారపు రమేష్
పాలకుర్తి మండల కేంద్రంలో లో గుడివాడ చౌరస్తా లో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు
కార్మిక ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న మోడీ సర్కార్, మేడే స్ఫూర్తితో హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని సిపిఎం ఏరియా కార్యదర్శి సింగారపు రమేష్ అన్నారు. మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాలకుర్తి మండలంలోని పలు గ్రామాలలో సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో సిపిఎం సిఐటియు జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ పాల్గొని మాట్లాడుతూ
1886లో మే ఒకటో తేదీన చికాగో నగరంలో కార్మికవర్గం తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించారు ఆ రోజుల్లో 18 -20 గంటలు కార్మికులు పనిచేసే వారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసుకొని యాజమాన్యాలు దోపిడీ చేసేవి.8గంటల పనిదినం కోసం కార్మికవర్గం పెద్ద ఎత్తున చికాగో నగరంలో ప్రదర్శన జరుపుతుంటే ఆ ప్రదర్శన అత్యంత పాశవికంగా పోలీసులు కాల్పులు జరిపారు ఆ ప్రాంతమంతా రక్తపుటేరులు మారింది.. అనేక మంది అమరులయ్యారు.. రక్తంతో తడిసిన గుడ్డనే ఇదే మా కార్మికుల జెండా ఎర్రజెండా గా కార్మికులకు త్యాగాలకు ప్రతీకగా వచ్చిందన్నారు కానీ ప్రపంచ వ్యాప్తంగా సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఆయన అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలు పెద్ద ఎత్తున అమలు చేస్తూ కార్మికుల హక్కుల మీద దాడి చేస్తుందని అన్నారు గత అనేక ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలపై మోడీ ప్రభుత్వం కాలరాస్తుంది అన్నారు 29 రకాల కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్చి కార్మికుల వ్యతిరేకంగా వస్తుందని అన్నారు. ఇప్పటికే 8గంటల పనిదినం పోయి 12గంటల పనిదినం సర్వ సాధారణమైంది అని అన్నారు మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ లతో పని గంటలు,సమ్మె హక్కు, ఉద్యోగ భద్రత, కార్మికుల హక్కులు సంక్షేమంకు పెద్ద ప్రమాదం వచ్చిందని అన్నారు మేడే స్ఫూర్తికి భిన్నంగా మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలలో మారుస్తుందని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తుందని అన్నారు.పెట్రోలు డీజిల్ గ్యాస్,నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపిందని అన్నారు. కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.21వేలకు పెంచాలని, కార్మికులకు చట్టపరమైన హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్.డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలుతగ్గించాలని అన్నారు. నిరుద్యోగం, దారిద్య్రం, పేదరికం, అవినీతి దేశంగా మోడీ ప్రభుత్వం మారుస్తుందని అన్నారు. బిజెపి తన మతోన్మాద ఎజెండాను అమలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలి దేశాన్ని అధోగతి పాలు చేస్తుందని అన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమించి మోడీ మెడలు వంచారాని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన కులాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్మడి రాజు సాంబయ్య. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న. సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు మాచర్ల సారయ్య. సోమ సత్యం. ముస్కు ఇంద్రారెడ్డి. సిఐటియు నాయకులు దేశ బోయిన రాములు. ఏనుగు తలవెంకన్న. చిట్యాల సంధ్యారాణి. తోట రాజు. బెల్లి సంపత్. పనికిరాజు. భాస్కర్. నాగన్న. కాకర్ల రమేష్. బాణాల వెంకన్న. కాకర్ల బాబు. కాకర్ల లక్ష్మి. మోత్కుపల్లి యాక లక్ష్మి. కాకర్ల పద్మ. వెంకటమ్మ. రేణుక. బెల్లి సతీష్. ఎడ్ల బిక్షపతి. దేవేంద్రం మచ్చుపాడు సోమయ్య. తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.