mla sethakka mulugunews aituc news

మే డే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో మే డే సందర్భంగా హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఈ ప్రపంచం మనుగడ సాధిస్తోంది అంటే అందుకు కారణం పునాది వేస్తున్న కార్మిక, కర్షక లోకమే. వారి సేవలే లేకపోతే… ప్రపంచం స్తంభించిపోతుంది. ఒక్క పని కూడా ముందుకు సాగదు. మరి వారిని కీర్తించేందుకూ, వారి సేవల్ని గుర్తించి శుభాకాంక్షలు చెప్పేందుకు అద్భుత అవకాశంగా మేడే అని
ఈ ప్రపంచంలో కష్టపడే ప్రతివారూ కార్మికులే. శ్రమించే ప్రతివారూ శ్రామికులే. అందరూ అందమైన భవిష్యత్తును నిర్మించేందుకే రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. వీరిలో కార్మిక, కర్షకుల శ్రమకు విలువకట్టలేం. చాలా మంది తినీ తినక పనిచేస్తుంటారు. బలహీనంగా ఉన్నా… పనికి వస్తారు. మజ్జిగ నీళ్లతో కడుపు నింపేసుకునే కార్మికులు కూడా మన దేశంలో ఇంకా ఉన్నారు. విపరీతంగా పెరిగిన ధరలు వారిని కడుపునిండా తిననివ్వట్లేదు. వారి కోసం ఎన్నో చట్టాలున్నా… అమలు అంతంతమాత్రమే. కార్మిక, కర్షక దోపిడీ యధేచ్చగా కొన సాగుతోంది అని కార్మిక లోకానికి మే డే శుభా కాంక్షలు తెలుపుతూ కార్మికులు కర్షకులు మన హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాలని సీతక్క గారు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కార్మిక సంఘం జిల్లా నాయకులు జంపాల రవీందర్,గోవిందా రావు పేట సహకార సంఘం చైర్మన్ పాన్నల ఎల్లారెడ్డి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసూపు త్ సీతారాం నాయక్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.