కార్మిక నాయకునికి కడసారి వీడ్కోలు

శోకసముద్రంలో కార్మిక వర్గం!!
(పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ MLA జూలకంటి రంగారెడ్డి, AIKS ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి )

కార్మిక పక్షపాతి వరంగల్ ఉమ్మడి జిల్లా కార్మిక నాయకుడు జనగామ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ అంబటి సత్యనారాయణ అకాల మరణం పార్టీకి తీరని లోటని వారు చూపిన మార్గంలో, వారి ఆశయ సాధన కోసం పార్టీ నాయకత్వం పని చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, AIKS ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు

దివి: 15- 2 -20201 సోమవారం రోజున కామ్రేడ్ అంబటి సత్యనారాయణ అంతిమయాత్ర పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, AIKS ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి గారలు పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం, కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం మరియు వ్యవసాయ కూలీల హక్కుల నిరంతరం పోరాడుతూ తన జీవితాన్ని ప్రజల కోసం పణంగా పెట్టి పార్టీ కోసం పని చేశారని కొనియాడారు. కామ్రేడ్ అంబాటి సత్యనారాయణ ఇటు చేర్యాల ప్రాంతంలోను ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో KGKS రాష్ట్ర కమిటీ సభ్యులుగాను సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులుగాను వ్యవసాయ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగారని తెలిపారు. వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని జనగామ జిల్లాలోని యువత ముందుకు రావాలని అన్నారు. వారి ఆశయాలను పార్టీ ఎన్నటికి మర్చిపోదని, వారి ఆశయాల కోసం నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదు, కKGKS రాష్ట్ర కార్యదర్శి రమణ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, వరంగల్ జిల్లా రూరల్ కార్యదర్శి సిహెచ్ రంగయ్య, వరంగల్ జిల్లా అర్బన్ కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి, నక్క యాదవరెడ్డి, దాసరి కళావతి, ఎదునూరి వెంకటరాజం, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, బూడిద గోపి, రాళ్ళబండి శశిధర్, P.ఉపేందర్ సాంబరాజు యాదగిరి. ఆర్ మిట్యానాయక్, రాపర్తి సోమన్న, గొల్లపల్లి బాపురెడ్డి, బోట్ల శేఖర్, పొదల నాగరాజు, సోమ సత్యం, బి నరేందర్, పట్టణ కమిటీ సభ్యులు జోగు ప్రకాష్, బిట్ల గణేష్, బొట్ల సుగుణ ఐద్వా జిల్లా కార్యదర్శి, పల్లెర్ల లలిత, పందిళ్ళ కళ్యాణి, తూడి దేవదానం, బూడిద అంజమ్మ, బూడిద జ్యోతి, ప్రజానాట్యమండలి కళాకారులు బొట్టు సూరి, జెరిపోతూల యాకయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, బక్క నాగరాజు, టిఆర్ఎస్ నాయకులు గద్దల నర్సింగ్ రావు, పెంబర్తి MPTC మూల రవి, మాజీ ఎంపీపీ బైరగోని యాదగిరి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాటి కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారపు వెంకట్, టిడిపి నాయకులు బైరుబాబు, మాజీ సర్పంచి సంజీవ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.