కార్మిక వర్గానికి చట్టాలు హక్కులు సాధించిన మహానీయుడు బి టి ఆర్

కార్మిక వర్గానికి చట్టాలు హక్కులు సాధించిన మహానీయుడు బి టి ఆర్ గారు
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న
కార్మిక వర్గానికి చట్టాలు హక్కులు సాధించిన మహనీయుడు బి టి ఆర్ గారిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న అన్నారు. బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలో
కార్మికోద్యమనేత బీటీ రణదివే 32వ వర్ధంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ భారతదేశ కార్మిక ఉద్యమంలో బిటి రణదివే కీలకపాత్ర పోషించారని భారతదేశ కార్మిక వర్గానికి చట్టాలు హక్కులు సాధించిన మహనీయుడు అని కొనియాడారు భారత పెట్టుబడిదారీ వర్గం కార్మిక వర్గాన్ని శ్రమదోపిడి చేస్తుందని శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గ విముక్తి కోసం కార్మికులు సంఘటితంగా పోరాడాలని తమ హక్కులు కాపాడుకోవాలని అన్నారు కేంద్రంలో బిజెపి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా సవరణలు చేస్తుందని విమర్శించారు దీని ఫలితంగా కార్మికులు మరింత బానిసత్వంలోకి నెట్టివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది గంటల పని 12 గంటలకు పెంచుతూ కార్మికుల పై మరింత అదనపు పని భారం మోపుతున్నారని కనీస వేతనాలు అమలు చేయడం లేదని కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలతో పాటు సామాజిక అణచివేత వ్యక్త రూపాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ సామాజిక సమస్యలపై బిటీఆర్ గారి స్ఫూర్తితో ఉద్యమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భాష బోయిన రమేష్. ఎల్లయ్య. కుమార్. మైబు సమ్మయ్య. బి వెంకన్న. డి సోమన్న.
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.