#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఈ69 న్యూస్ జఫర్ ఘడ్/మార్చి29
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దుకై సమరశీల పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య పిలుపునిచ్చారు.
జఫర్గడ్ మండల కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేయాలని,సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని, ప్రైవేటైజేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.శ్రామిక శక్తిని కారుచౌకగా విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. చట్టాలను సవరించి లేబర్ కోడ్ బిల్లులు తీసుకు వచ్చిందని,ఫలితంగా కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయని,ప్రభుత్వ రంగ సంస్థలను,సహజ వనరులను దోచి పెడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలకు కార్మికులు సన్నద్ధం అవుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే రెండు రోజులపాటు చారిత్రాత్మక సమ్మెను కార్మిక లోకం నిర్వహించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి యాతం సమ్మయ్య అంగన్వాడి జిల్లా నాయకురాలు శారద సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వెంకటేశ్వర్లు ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు ఎండి షబానా సిపిఐ నాయకులు జువారి రమేష్. వ్యవసాయ కార్మికసంఘం నాయకులు కాటా సుధాకర్,గుండెబోయిన రాజు,కెవిపిఎస్ నాయకులు ప్రభాకర్,పిఎన్ఎం నాయకులు ఎండి శంశొద్దిన్,సారంగం, సోమన్న,కళావతి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.