kamareddy news citunews #e69news

సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మేడే వారోత్సవాలు సిఐటియు జిల్లా కన్వీనర్ కె చంద్రశేఖర్

  • వారు మాట్లాడుతూ 136 వ మేడే జెండాను ఆవిష్కరించారు*
    ఈ కార్యక్రమంలో కే చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1886లో అమెరికాలో చికాగో నగరంలోని హే మార్కెట్ లో ఎనిమిది గంటల పని దినాలు కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కనీస హక్కుల కోసం కార్మిక వర్గం వీరోచితమైన పోరాటం చేస్తున్న క్రమంలో ఆనాటి పాలక వర్గం యజమానుల తొత్తులుగా మారి పోలీసులు చేత ఆరుగురు కార్మిక నాయకులను కాల్చి చంపారు వీర మరణం చెందిన కార్మిక నాయకుల రక్తం ఏరులై పారుతున్న క్రమంలో రక్తపుమడుగులో నుంచే పుట్టిన కార్మికుల మేడే ఎర్ర జెండాను ఎగురవేసిన చరిత్ర ఉంది అని అన్నారు పోలీసుల కాల్పుల్లో వేలాది మంది కార్మికులకు గాయాలయ్యాయి అనేకమందిని అక్రమ కేసులు పెట్టి నిర్బంధానికి గురిచేసిన పరిస్థితి ఉంది ఆ పోరాట ఫలితంగానే ఎనిమిది గంటల పని దినాలు కార్మికులకు కనీస వేతనాలు హక్కులను సాధించుకోవడం జరిగింది అందుకోసమే ప్రతి ఏటా మేడే వారోత్సవాలను కార్మిక వర్గం విజయవంతం చేసుకుంటున్న అటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కార్మిక హక్కులను కాలరాయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారుల కోసం వారి తాబేదార్ల కోసం కార్పొరేట్ శక్తుల లాభాల కోసం కార్మికుల హక్కులను కాలరాస్తూ దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని ధ్వంసం చేస్తూ ఎనిమిది గంటల పని దినాలను రద్దు చేస్తూ వేతనాల పెంపుదల యూనియన్ల భాగస్వామ్యం లేకుండా 29 రకాల కార్మిక కో డ్ ల ను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తోంది అలాగే నిత్యావసర సరుకుల ధరలను అడ్డూ అదుపు లేకుండా పెంచి కార్మిక వర్గాన్ని ప్రజానీకాన్ని దుర్భరమైన జీవితాలు గడిస్తున్న ప్రభుత్వాలు ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు కార్మిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతూనే ఉంది అన్నారు
    అలాగే మేడే స్పూర్తితో ప్రతి కార్మికునికి నెలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని పోరాడి సాధించుకున్న హక్కులను సాధించే అంత వరకు పోరు సాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు మున్సిపల్ ఆఫీస్ వద్ద పోస్టల్ అధ్యక్షులు బిక్షపతి ఎల్ఐసి కార్యదర్శి వెంకటేశం గ్రంథాలయం వాటర్ వర్క్స్ వద్ద హమాలి యూనియన్ మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రజెంట్ యూనియన్ ప్రశాంత్ గౌడ్ బిఎస్ఎన్ఎల్ వలి ఆర్టీసీ బాబా గాయత్రి ఫ్యాక్టరీ యూనియన్ రామ్మోహన్ అంగన్వాడీ యూనియన్ స్వరూప మంజుల ఆశ యూనియన్ పద్మ మంజుల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మున్సిపల్ శానిటేషన్ మార్కెట్ అమాలి యూనియన్ బిల్లింగ్ రంగం అడ్డ మీద జయప్రకాశ్ నారాయణ విగ్రహం వద్ద ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజనర్సు మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సంతోష్ వడ్లు రాజేందర్ మధు బిల్లింగ్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్ హమాలి యూనియన్ నర్సింలు చంద్రం మార్కెట్ అమాలి యూనియన్ రాజు నర్సింలు నాయకులు మధు ఉ రంజిత్ భరత్ సాయిబాబా పోచయ్య సాయి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.