gnpnews #cpinews

సిపిఐ స్టేషన్ ఘనపూర్ మండల కార్యదర్శి కూరపాటి విజయ్ కుమార్
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ మే01
స్టేషన్ ఘనపూర్ :-సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఎర్రజెండాలు ఎత్తి కార్మికులకు నివాళులు అందించి మేడే ఉత్సవాళలను ఘనంగా జరిపారు.అనంతరం సిపిఐ మండల కార్యదర్శి కూరపాటి విజయ్ కుమార్ ఏఐటీయూసీ మండల నాయకులు తోట రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కార్మిక అనుకూల చట్టలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వంను గద్దె దించాలని కోరారు.వ్యతిరేక చట్టాలలో పనిగంటలు ఎనిమిది నుండి పన్నెండుగంటలు పెంచడం,కార్మిక యూనియనులు పెట్టకుండా చట్టాలు తీసుకొచ్చి,సంఘటిత అసంఘటిత కార్మికులకు పిఎఫ్,ఇసిఐ,కనీస వేతనాలు ఇవ్వకుండా పెట్టుబడుదారులకు అనుకూల చట్టాలు చేస్తూ కార్మికుల శ్రమ దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నదని,ప్రభుత్వరంగ ఆస్తులైన,బ్యాంకు,రైల్వే, ఎల్ఐసి,విమానం,బొగ్గు,వ్యవసాయం,విశాఖఉక్కు లాంటి వాటిని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను,అందులో పనిచేసే కార్మికులను పెట్టు బడిదారులకు తక్కువకు అమ్మి దేశ సంపదను ఆర్థిక వ్యవస్థను దివాళాతీసే విదంగా వ్యవహారిస్తున్న బీజేపీ ప్రభుత్వంని అధికారం నుడి తొలగించే విదంగా కార్మిక కర్షక లోకం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.చాగల్లు,తాటికొండ,స్టేషన్ ఘనపూర్,శివునిపల్లి,నమిలిగొండ,కొత్తపల్లి పామునూరు తదితర గ్రామాలలో ఎర్ర జెండా ఎత్తిన నాయకులు ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ ఎండి రహమతుల్లాహ్ ఎఐఎస్ఎఫ్ జిల్లా కాన్వీనర్ చింత జగదీశ్,ఎండి యునుస్,గాండ్ల అజయ్,బూర్ల యాదగిరి, చల్లా శేషిరేక,సముద్రాల రాజు,నరేష్,మహేందర్ వెంకటేష్ తదితరులు పాలుగోన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.