కావేరి కుటీర నందు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అనే షార్ట్ మూవీ ఆవిష్కరణ

ఈరోజు నిర్మల్ జిల్లాలోని గాజులపేట సమీపంలో ఉన్న కావేరి కుటీర నందు కవులు కళాపోషకులు అయినటువంటి డాక్టర్ అప్పల చక్రధర్ గారి చేతుల మీదుగా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అనే షార్ట్ మూవీ ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ అప్పల చక్రధర్ గారు మాట్లాడుతూ ఈ షార్ట్ మూవీస్ ద్వారా మారుమూలన ఉన్న కళాకారులకు సోషల్ మీడియా ఒక మంచి వేదికగా మారిపోయిందని ఎందరో మంది సెలబ్రిటీలు కూడా అయ్యారని తక్కువ ఖర్చుతో మంచి సందేశాత్మకమైన చిత్రాలు తక్కువ సమయంలో నిర్మించుకుంటున్నారని పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అనే షార్ట్ మూవీ మంచి హాస్యంతో కూడి ఉన్నదని వారు తెలియజేశారు. నిర్మల్ జిల్లా ఉన్న కళాకారులు షార్ట్ మూవీస్ లో చేస్తూ ఇంకా ఉన్నతమైన సినిమాలు చేయాలని నిర్మల్ జిల్లా ఉన్న కళాకారులు అందరు కూడా ఏకధాటిపై నడవాలని వారు తెలియజేశారు. ప్రముఖ కళాకారుల జోసఫ్ బాబూరావు , అంబటి నారాయణ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఉన్న కళాకారులు అందరు పెద్ద పెద్ద సినిమాలో నటించాలని నిర్మించాలని ఈ లఘు చిత్రంలో నటించిన వారందరిని అభినందించారు. ఇందులో దర్శకులు ఏకే రాజేందర్, నిర్మాత శోభారాణి , అశ్విని గంగేశ్వర్ జిల్లా అధ్యక్షులు జన్ను అనిల్ ,అంజయ్య, రాజేశ్వర్, వెన్నెల రాజేందర్ .అంబటి నారాయణ, జోసఫ్ బాబురావు, డాక్టర్ స్వామి, మనోహర్ భీమన్న, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.