కిషన్ పుర గురుద్వారా లో సర్ధార్ గురు గోవింద్ సింగ్ జయంతి

కాంగ్రెస్ భవన్ -20-01-2021

కిషన్ పుర గురుద్వారా లో సర్ధార్ గురు గోవింద్ సింగ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయిని…

గురువారం రోజున గురుగోవింద్ జయంతి ఉత్సవాలను కిషన్ పుర గురుద్వారాలో ఘనంగా నిర్వహించారు. గురుద్వారాలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు పాల్గొని పూజలు నిర్వహింఛి సిక్కు సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సిక్కుమత పదవ గురువు అని 1675 నవంబరు 11 న సిక్కుమత గురువయ్యాడు. ఇతను తన తండ్రి గురు గోవింద్ సింగ్ సిక్కు విశ్వాస నాయకుడు, యోద్ధ, కవి మరియు జ్ఞాని. ఇతను ఖల్సాను స్థాపించాడని, గురుగోవింద సింగ్ తాను చనిపోవడానికి ముందు, సిక్కుల పవిత్రగ్రంథం గురు గ్రంథ సాహిబ్‌ను సిక్కుమతానికి ఆఖరి గురువుగా ప్రకటించారు. సిక్కులంతా తమ గురువుల యొక్క బోధనలను అనుసరించాల్సిన అవసరముందని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, సర్దార్ తరంజిత్ సింగ్, సర్దార్ ఆజాబ్ సింగ్, సర్దార్ శ్యామ్ సింగ్, సర్దార్ ఓంకార్ సింగ్, సర్దార్ బల్దేవ్ సింగ్, సర్దార్ మహేందర్ సింగ్, సిఖ్ సంఘ్ అద్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు .

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.