#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించేందుకు 350 మంది సిబ్బంది తో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్.. తెలిపారు.
శివరాత్రి వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణమండపం, గుడి ప్రవేశద్వారం దగ్గర ఏర్పాట్లు, పార్కింగ్, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని భక్తులను యోగేష్ గౌతమ్ కోరారు.
అధికారులకు, సిబ్బంది కి వారి విధులు బాధ్యతలు అప్పగించారు.
ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు సదయ్య, వెంకటరమణ, రేల జనార్ధన్, సదానందం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.