జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసిన

అన్ని విద్యార్థి సంఘాలు మరియు ఎమ్మార్పీఎస్ నేతలు……

అదిలాబాదు మండల పరిధిలో చాంద(టి) గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 22న అక్కడ విధులు నిర్వహిస్తున్న దళిత ఉపాధ్యాయుడు అయినా పురుడు దేవదాసు పై అక్కడున్న ప్రధానోపాధ్యాయురాలు శశికళ గారు అకారణంగా దళితుడైన దేవదాసు పై కులం పేరుతో దూషిస్తూ తన భర్తను పిలిపించి తోటి ఉపాధ్యాయుల ముందు దారుణంగా కొట్టించడం జరిగింది ఇంత జరిగినా కూడా జిల్లా పోలీసు యంత్రాంగం ఆమెపై కేసు నమోదు చేయకపోవడం అత్యంత బాధాకరమైన విషయం అదే సందర్భంలో జిల్లా విద్యాధికారి గారు నిర్లక్ష్యంగా వలన ఈ గొడవకు అసలు కారకురాలైన ప్రధానోపాధ్యాయురాలు పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తన నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది అగ్రకుల భావజాలానికి వత్తాసు పలకడమనే అనే అంశం ఈ సందర్భంగా తేటతెల్లమవుతుంది ఈ పరిణామాలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయి దళిత గిరిజన వర్గాల ఉపాధ్యాయులకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాల్సిన జిల్లా అధికార యంత్రాంగం అగ్రకుల ఆధిపత్య వర్గాలకు కొమ్ము కాసే విధంగా ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం తక్షణమే పోలీస్ యంత్రాంగం ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ కేసు నమోదు చేయాలి, అలాగే జిల్లా విద్య శాఖ అధికారి గారు వెంటేనె స్పందించి అసలు కారణమైన బాధ్యురాలు ను సస్పెండ్ చేయాలి, లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలను కలుపుకొని ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేష్ మాదిగ,AISF మేస్రo భాస్కర్ గెడం కేశవ్ SFI ఆత్రం నగేష్ ASU మర్సుకొల అశోక్ సలాం వరుణు PDSU వినోద్ నాయక్ TGVP కొత్తూరు ప్రవీణ్ గొటిముకళే సుభాష్ మాదిగ GSU అత్రం రవికాంత్
కో, కన్వీనర్ బరుకుంట సుభాష్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.