సమస్య తీవ్రతను ఎన్ని సార్లు చెప్పిన కన్నెత్తి చూడని గ్రామపంచాయతీ అధికారులు పాలకవర్గం
మునగాల మండలం కృష్ణా నగర్ గ్రామంలో 90శాతం వైకల్యం కారణంగా తన రెండు చేతులతో నేలపై నడుస్తూ జీవనం సాగిస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకుడు జూకంటి సైదులు ఇంటి ముందు గ్రామానికి చెందిన జూకంటి వెంకయ్య పశువుల దొడ్డి నుంచి జూకంటి నాగేశ్వరరావు ఇంట్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ నిరంతరం చెరువును తలపిస్తూండటంతో అంగవైకల్యం కారణంగా తన చేతులనే పాదాలుగా మలుచుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళి వచ్చే జూకంటి సైదులు కు తన ఇంటి ముందు వస్తున్న చెరువును తలపించే నీటి నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని అంతేకాకుండా జూకంటి వెంకయ్య పశువుల దొడ్డి నుంచి వచ్చే వాటర్ వలన ఇంట్లో విపరితమైన దోమల సంచరిస్తూ తమ పిల్లలు కుటుంబ సభ్యులు విష జ్వరాల బారిన పడుతున్నారని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామ సభలోను ఎన్నిసార్లు చెప్పినా అధికారులు గ్రామపంచాయతీ పాలకవర్గం పెద్దలు అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారని తక్షణమే సంబంధిత అధికారులు గ్రామపంచాయతీ పాలకవర్గం పెద్దలు స్పందించి పరిష్కారం చూపించాలని గ్రామ పంచాయతీ అధికారులను పెద్దలను జూకంటి సైదులు వేడుకుంటున్నాడు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *