#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఫోటో మరియు వీడియో గ్రాఫర్ లు నూతన టెక్నాలజీని పెంపొందించుకోవాలి

కెనాన్ కంపెనీవారు ఫొటో టెక్ వారి సౌజన్యంతో రాష్ట్రఅసోసియేషన్ మరియు సూర్యాపేట జిల్లా మరియు సూర్యాపేట పట్టణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించు కెనాన్ వర్క్ షాప్ స్థానిక త్రివేణి ఏసీ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ వర్క్ షాప్ లో కెనాన్ ఫ్యాకల్టీ భూపాల్ ఫోటోగ్రాఫర్లకు కావలసిన మెనూ సెట్టింగ్ టెక్నాలజీ అప్డేట్ వివరించారు మోడల్ షూట్ మరియు లైటింగ్ ఎక్స్పోజ్ వాటి గురించి ఫోటోగ్రాఫర్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కెనాన్ విష్ణు, శరత్ సాగర్ , జూలూరు మధు ,మరియు సూర్యాపేట పట్టణ అధ్యక్షులు కొచ్చర్ల రవి అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగినది నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీమన్నారాయణ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి ,శేఖర్ ,గణేష్, సూర్యాపేట జిల్లా వివిధ మండలాల నుండి 500 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొని వర్క్ షాప్ ని వినియోగించుకున్నారు …

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ.రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,
వర్క్ షాప్ లో ప్రధానంగా కుటుంబ భరోసా పథకం లో చేరని ఫోటోగ్రాఫర్స్ అందరూ ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం పొడిగించినట్లు ప్రతి ఫోటోగ్రాఫర్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తులో ఎవరికి ఎక్కడ ఆపద జరిగినా ఈ కుటుంబ భరోసా పథకం ఆదుకుంటుందని ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యమత్యంతో ఉండి ముందుకు నడవాలని సూచించారు ….

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగూరి యాదగిరి , రాష్ట్ర కార్యదర్శి గుణగంటి సురేష్ రాష్ట్రసహయకార్యదర్శి అయిటిపాముల మల్లికార్జున్ , జిల్లా ప్రధాన కార్యదర్శి రవి జిల్లా కోశాధికారి లాలూ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు రామకృష్ణా రెడ్డి ,హుజూర్ నగర్ తిరుమలగిరి ,తుంగతుర్తి, వివిధ మండలాల నుండి విచ్చేసారు పట్టణ ప్రధాన కార్యదర్శి MD నజీర్,
మరియు జిల్లా కమిటీ సభ్యులు పాష నందిపాటి సైదులు,ఓంకార్ రెడ్డి, శరత్ సక్సేనా, శేఖర్, దుర్గం బాలు, శ్రీనివాస్, మరియు పట్టణ కమిటీ సభ్యులు , రాము, రవి, శేఖర్, శంకర్, కిషోర్, సమీర్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.