janagama news

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల శేఖర్


రఘునాథ్ పల్లి మండల కేంద్రంలో కెవిపిఎస్ ముఖ్య నాయకుల సమావేశం ఆరూరి కిష్టయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి బోట్ల శేఖర్ హాజరై మాట్లాడుతూ కేవీపీఎస్ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన అని నినాదంతో 1998 అక్టోబర్ రెండున ఏర్పాటు చేయడం జరిగింది నాటినుండి నేటి వరకు దళిత బహుజన పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహించింది గ్రామాలలో హోటల్లో రెండు గ్లాసుల పద్ధతిని రూపుమాపే దానిలో కెవిపిఎస్ ముఖ్యపాత్ర పోషించింది అదేవిధంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటుకు ముఖ్య పాత్ర పోషించింది దళితవాడలో అభివృద్ధి లోకి రావడానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ సాధించింది అలాగే 1235 జీవో ప్రకారం దళిత స్మశాన వాటికకు స్థలాన్ని సాధించింది అని అన్నారు అలాగే జిల్లా కేంద్రంలో అనేక పోరాటాలు నిర్వహించి దానిలో కెవిపిఎస్ కీలక పాత్ర పోషించిన అన్నారు* ఈనెల 30వ తారీఖున జిల్లా కేంద్రంలో పూసల భవనంలో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు దళితులు బహుజనులు అందరూ పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు అనంతరం రఘునాథపల్లి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా ఆరూరి కిష్టయ్య ఉపాధ్యక్షులుగా శగ సాంబరాజు అరువులు ఎల్లయ్య ప్రధాన కార్యదర్శి కూరెళ్ళ నరేష్ సహాయ కార్యదర్శిగా తుడి శ్రీనివాస్ ఆరూరి ఎల్లయ్య కమిటీ సభ్యులు నాలుక పెళ్లి దావీదు మచ్చ లక్ష్మి జేరిపోతుల సౌందర్య మద్దెల లలిత ఆకారపు అంజయ్య అరూరు యాకయ్య ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో వ్యాకసా జిల్లా నాయకులు మహేందర్ కెవిపిఎస్ నాయకులు కడారి ఐలయ్య గొలన్కొండ చక్రపాణి కడారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.