దళితుల సమస్యల పరిష్కారం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కెవిపిఎస్ రాష్ట్ర3వ మహాసభలు ఆగస్టు7నుండి సంగారెడ్డి లో నిర్వహిస్తున్నట్లు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రం దొడ్డి కొమురయ్య భవనంలో కెవిపిఎస్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రికలను వాల్ పోస్టర్ కెవిపిఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 7న సంగారెడ్డిలో నీలిదండు కవాతు” ప్రదర్శన – బహిరంగసభ జరుగనుందని తెలిపారు.
ముఖ్యఅతిథిగా కేరళ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రివర్యులు దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ అధ్యక్షులు కె రాధాకృష్ణన్ హాజరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కులదురహంకార హత్యలు సాంఘీక బహిష్కరణలు దాడులు దౌర్జన్యాలు పెరిగాయన్నారు. దేశంలో అనుసరిస్తున్న మనువాద విధానాలు రాజ్యాంగం
రిజర్వేషన్ల రద్దు కు కుట్రలు చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర విధానాలు దళితులకు ఉపాధిని లేకుండా చేస్తుందన్నారు. ఈ విధానాలపై రాష్ట్ర వ్యాపిత కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఆగస్టు 8 న ఉదయం 10గంటలకు ప్రతినిధుల ప్రారంభ సభ ను ప్రముఖ సామాజికవేత్త అంబేద్కర్ వాదీ జే బి రాజు గారు ప్రారంభిస్తారని డి ఎస్ ఎం ఎం జాతీయ కార్యదర్శి బి వి రాఘవులు అతిదిగా హాజరవుతారని అన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుశ రాములు జిట్ట నాగేశ్ జిల్లా సహాయ కార్యదర్శి గాదే నరసింహ బొల్లు రవీందర్ కత్తుల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు
