కెసిఆర్, దయాకర్ రావు చిత్ర పటాలకు క్షీరాభిశేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లాకు నాలుగు చోప్పున రాష్ట్రంలో 132 స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చోప్పున మరో 33 మహత్మా జ్యోతిబా ఫూలే బీసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాడాన్ని హర్షీస్తూ కె.యూ జె.ఎ.సి వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి యువజన నాయకులు డాక్టర్.మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో పాలకుర్తీ రాజీవ్ చౌరస్తాలో కె.సి.ఆర్, మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటాలకు పాలాభీషేకం చేసారు.
ఈ సందర్భంగా డాక్టర్.మేడారపు సుధాకర్ మాట్లాడూతూ తెలంగాణా ముఖ్యమంత్రి కె.సీ.ఆర్ విద్యారంగ పటిష్టత కోసం బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ వర్గాల విద్యార్ధులకు విద్యను అందించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 132 స్టడీ సర్కీళ్లు, జిల్లాకు ఒకటిగా 33 మహత్మా జ్యోతిబా ఫూలే బీసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం హర్షణీయమని, పాలకుర్తీ నియోజకవర్గ విద్యార్ధీ, యువత పక్షాన తెలంగాణ సి.యం కె.సీ.ఆర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంతివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని గురుకుల పాఠశాలల్లో, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్మీడియేట్ విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించడం శుభపరిణామమన్నారు, తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ ప్రక్షాళనతో విద్యార్ధీని, విద్యార్ధుల భవిష్యత్ బంగారు మయమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీ.ఆర్.ఎస్ పార్టీ యువజన, విద్యార్ధీ నాయకులు జోగు కూమార్, కోడం సాయిరాం, కమ్మగాని వెంకన్న, జోగు కృష్ణ, చేరిపెల్లి సునిల్, వంగాల అశోక్, గాదరి ప్రసాద్, దీలిప్, వయ్య ఎల్ల స్వామి, బోంకురి సాగర్, భాస్కర్, బూమ శ్రావణ్, ప్రశాంత్, సాయి కృష్ణ, అరవింద్, అజయ్, రొడ్డ అరుణ్, దోగ్గెల కుమార్,అరుణ్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.