వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్

బీసీ సంక్షేమ సంఘం
వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు

కేంద్ర ప్రభుత్వం బిసి కుల గణన చేపట్టాలని కోరుతూ శనివారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణు గోపాల్ గౌడ్ నాయకత్వంలో 50 మంది ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఉద్యమకారులు ఈ నెల 13వ తేదీన తల పెట్టిన బీసీల చలో ఢిల్లీ
కార్యక్రమానికి తరలి వెళ్ళారు. ఈ సందర్బంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కలలో బీసీల లెక్కలు కచ్చితంగా లెక్కించాలి అని డిమాండ్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం 1931 సం.లో తీసిన బీసీ లెక్కల ఆధారంగానే ఇప్పటి వరకు కూడా విద్య, ఉద్యోగ రాజకీయ రంగాలలో కేవలం 27% రిజర్వేషన్ లు ఇవ్వడం వలన బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది అని అన్నారు. దేశంలో 50% పైన ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ కులగణన చేపట్ట కుంటే ఈ 13వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశ వ్యాప్తంగా వస్తున్న లక్షలాది బీసీ ఉద్యమకారులతో బీసీల మహాధర్నా చేపట్టనున్నట్లు, 14న కేంద్రమంత్రుల ఇండ్ల ముట్టడి కార్యక్రమము,15న, అన్ని పార్టీల నాయకులతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలతో దేశాన్ని స్తంభింప చేస్తామని అన్నారు. ఢిల్లీ కార్యక్రమానికి, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు దొడ్డపల్లి రఘుపతి, చాగంటి రమేష్, డ్యాగల శ్రీనివాస్, ఇట్టబోయిన తిరుపతి యాదవ్, రాకేష్, రంజిత్, బొమ్మ శంకర్, మాటురి రవీందర్ గౌడ్ , ముంజ వెంకటేష్, బాషబోయిన వేణు యాదవ్, తాళ్ళపెళ్లి మహేష్, కార్తిక్ , సమ్మయ్య తదితరులు తరలి వెళ్ళారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.