|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

E69న్యూస్ రేగొండ:జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్ప కాయల నరసయ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,గ్యాస్ మరియు విద్యుత్ ఛార్జీలు,బస్సు చార్జీలు పెంచిన దానికి నిరసనగా మండల కేంద్రంలో టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన రాస్తారోకో చేయడం జరిగినది.కేంద్రం డీజిల్,పెట్రోల్,గ్యాస్ ధరలను పెంచి ప్రజల పై భారం మోపుతూ పేద ప్రజలను మోసం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బస్సు చార్జీలు కరెంటు చార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతూ మోసపూరిత వాగ్దానాలు గద్దెనెక్కి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ దొంగల పరిపాలన చేస్తూ దోపిడీ పరిపాలన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ బ్రతుకుతున్న ఈ పాలకులను తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు.పాలించే వాడే నడి బజార్లో ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వారు అన్నారు.అటు మోడీ సర్కార్ నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీలో 750 మంది రైతులను పొట్టన పెట్టుకుని రైతులను చంపి రాక్షసానందం పొందినటువంటి బీజేపీ పాలన మోడీ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త కొత్త స్కీములు పెట్టి దళిత దగా బంధు,రైతుబంధు రాబందులకు బంధు ఇలాంటి స్కీమ్ ల పేరుతో ఎమ్మెల్యేలకు ఎంపీలకు భూస్వాములకు తమ సొంత కార్యకర్తలకు వర్తింపజేసి స్కీములు పెట్టి ఈ పేద ప్రజలను వంచుతూ దగా పరిపాలన చేస్తూ ధనార్జనే ధ్యేయంగా కుటుంబ పరిపాలన చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్న ఈ కేసీఆర్ కు రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని,పెంచిన డీజిల్, పెట్రోల్,గ్యాస్,బస్సు చార్జీలు,కరెంటు చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈనాటి కార్యక్రమంలో మండల ఎస్సీసెల్ అధ్యక్షులు మేకల రవికుమార్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు నాగపురి మొగిలి గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి పత్తి తిరుపతి,బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జోరు సుదర్శన్,మండల సీనియర్ నాయకులు గుంటోజు కిష్టయ్య, మండల సీనియర్ నాయకులు మూడతన పెళ్లి శంకరయ్య,క్యాతన్ సదయ్య, సీనియర్ నాయకులు కొలిపాక ప్రసంగి,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి ఎండి అస్లాం,ఎండి జలీల్, సూధన బోయిన ఓం ప్రకాష్,కోనరావుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు జవ్వాజి వీరస్వామి,రంగయ్యపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు చిలువేరు సాంబయ్య, మండల కార్యదర్శి బానోతు రవీందర్, రొంట్టాల సదయ్య,ఎండి రహీం పాషా, మండల ఉపాధ్యక్షులు కౌడగని తిరుపతి, కూతురు దేవేందర్,జూపాక మొగిలి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.