కేంద్ర నిరంకుశ పాలనపై ఉద్యమించాలని ఈ నెల 28 29 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాయి. ప్రజాపంపిణీ ద్వారా నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజల మధ్యన చిచ్చుపెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు, దేశాన్ని పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు తాకట్టు పెడుతున్నారని పార్లమెంట్లో తమకున్న బలంతో కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించు తున్నారని పాల గురు లేబర్ కోడ్ లపేరుతో కార్మికులకు ఉన్న హక్కులను హరించి వేస్తుందని ప్రజాస్వామ్య హక్కుల కోసం కార్మిక చట్టాలు రక్షణ కోసం ప్రజలంతా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.