కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ బిల్లులను పసంహరించుకోవాలి

కాంగ్రెస్ భవన్ – 11-01-2021..

టిపిసిసి ఆదేశాల మేరకు రైతు వ్యతిరేక చట్టాలు మరియు కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా.. చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకు వెళ్లారు. స్టేషన్ నుండి స్వయం పూచికత్తుపై బయటికి వచ్చాక ఆర్.డి.ఓ, వరంగల్ గారికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భాగా వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ బిల్లులను పసంహరించుకోవాలి. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనగోళ్లు చేపట్టాలి

పంట ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలి. పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కాలంటే కొనుగోలు కేంద్రాలుఉండాల్సిందే

రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. పంటల కొనుగోల్లలోను లాభ నష్టాలు చూసుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

పంటల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు మోదిని తిట్టి రైతుల బంద్ కు మద్దతు తెలిపిన కె సి ఆర్ ఇప్పుడు అదే వ్యవసాయ చట్టాలను అమలు చేయడం సిగ్గు చేటు.

.సి.ఆర్ తన అవనీతి ఎక్కడ బయటపడుతున్దోనన్న భయంతోనే కెసిఆర్ మోది పంచన చేరారు.రైతుల నుండి ప్రతి గింజ కొంటామని చెప్పి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం దారుణమని ఇది కొత్త సాగు చట్టాలకు అనుకూలం కాదా?

కొనుగోలు కేంద్రాల ఎత్తివేతపై ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అందులో భాగంగానే డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టి తహసిల్దర్లకు వినతిపత్రం సమర్పించడం జరిగింది.
తెలంగన రైతులకు సి ఎం కేసిఆర్ బహిరంగా క్షమాపణ చెప్పాలి.ఎందుకంటే అయన చెప్పి నట్లుగా సన్న రకం వారి వేసి రైతులు నష్ట పోయారని, ఆ నష్టాన్ని పూడ్చమని తాము కోరితే ఇప్పుడు నియంత్రిత సాగును కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం దారుణం.
తెలంగాణా రైతులకు సిఎం కె సి ఆర్ మోసం చేసారని, కేంద్ర నిర్ణయాలను కేసిఆర్ ఒక సారి వ్యతిరేకిస్తారు ఒకసారి మద్దతు ఇస్తారు, ధిల్లిలో చక్రం తిప్పుతా, దేశం చాల నష్టపోయింది, బిజెపి కి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ మాట్లాడిన కె సి ఆర్ దిల్లీలో మూడు రోజుల పాటు ఉండి కూడా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించలేదు

40 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రము సిద్ధంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరలు ప్రకటించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి.

రైతులకు మద్దతు ధర, రైతుల జీవితాలను నాశనం చేసేందుకు ప్రవేశ పెట్టిన చట్టాలను రద్దు చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తోందన్నారు.రాష్ట్రంలో నూతన సాగు చట్టాల అమలును విరమించుకోకుంటే రైతు ఉద్యమం చేపడుతామని అన్నారు.

ఉత్తర తెలంగాణా జిల్లా ల కో-ఆర్డి నేటర్ ఇనగల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రములో కె.సి.ఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత, తొందరపాటు నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. వ్యవసాయాన్ని తీవ్రమైన సంక్షోభంలో పడేసెలా తీవ్రమైన పరిణామాలకు దారి తీసేలా ఉంటున్నాయి. గ్రామాల్లో IKP కేంద్రాల చేత సహకార సంఘాల చేత పంటల కొనుగోలు పునరుద్ధరించాలి, వ్యవసాయ పంటలకు మద్దతు ధర కల్పించాలి.

గతంలో నియంతృత్వ వ్యవసాయ విధానాన్ని అమలు చేసి, తాము చెప్పిన పంటలు మాత్రమే వేయాలని, మొక్కజొన్నలు అసలే వేయవద్దని, దొడ్డు వడ్లు వేయవద్దని, సంనరకం ధాన్యమే పండించాలని నిభందనలు పెట్టారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ కేంద్రాలు మూత పడితే రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కోల్పోవడమే కాకుండా, ఐకేపి, వ్యవసాయ పరపతి సంఘాలు మూతపది రైతులు తీవ్రంగా నష్ట పోతారు. ఒక వైపు కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలతో దేశంలో వ్యవసాయం దారుణమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్న సమయంలో రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే రైతులు పండించిన పంటలను ఎవరికీ అమ్ముకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి. కేంద్రం తెచ్చిన మార్కెటింగ్ చట్టంతో రాబోయే రోజులలో వ్యవసాయ మార్కెట్ బయట కూడా బహిరంగంగా పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొనే అవకాశాలు కల్పించారు. దీంతో ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లు ప్రైవేటు మార్కెట్లతో పోటి పడలేక వ్యవసాయ మార్కెట్లు మూతపడే పరిస్థితి వస్తే ఇక వ్యవసాయం పూర్తిగా కార్పోరేట్ వ్యాపారస్తుల చేతిలో విలవిలలాదుతుందని అన్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కొనవలసిన బాధ్యత ఉండగా కొత్త చట్టాల వల్ల భవిష్యత్తులో ఈ బాధ్యత లేకుండా పోతుంది. కార్పోరేట్ వ్యాపారస్తుల చేతిలో కీలుబొమ్మగా మరే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది జరిగితే వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతుంది. అంతే కాదు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రారంభించిన ఇందిరా క్రాంతి పథకం కింద గ్రామాలలో పంటల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో ఆయ సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి పంటలు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధరలు ఇచ్చేలా కృషి చేసింది. దానికి తోడూ పంటల ఆధారంగా సహకార సంఘాల నుండి రైతులకు రుణాలు ఇచ్చి ఆడుకొని సంఘాలను ఆర్థిక పరిపుష్టి చేసేలా కృషి చేసింది. వ్యవసాయ పరపతి సంఘాలు కూడా పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇచ్చిందని అన్నారు.

మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ నేడు పంటల కొంగు కేంద్రాలను ఎత్తివేస్తే అటు రైతులతో పాటు, ఇటు ఐకేపి సంఘాలు, రైతు సహకార పరపతి సంఘాలు పూర్తిగా నిర్వీర్యమవుతాయి. ఇదంతా గ్రామీణ ఆర్థిక రంగాన్ని సంక్షోభంలో పడేసి రైతు కుతుమబాలను, ఐకేపి మహిళా సంఘాలను. సహకార సంఘాలను దివాలా తీయుస్తుంది. ఇంతటి సంక్షోభాలకు కారణం కాబోతున్న పంటల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయాలను ఉపసంహరించుకొని వాటిని మరింత ప్రోత్సహించి ఆదుకోవాలని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి విధంగా మంచి మద్దతు ధరలు ఇచ్చి భరోసా ఇవ్వాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణా జిల్లాల కో –ఆర్డి నేటర్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ కో–ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ కత్తి వెంకట స్వామి, పిసిసి సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, జి అమృత రావు, టిపిసిసి కార్యదర్శులు దొమ్మాటి సాంబయ్య, కుందూరు వెంకట్ రెడ్డి, కొత్తపల్లి శ్రీనివాస్, బోయినపల్లి అశోక్ రెడ్డి, మహమ్మద్ ఆయుబ్, మీసాల ప్రకాష్, డాక్టర్ పులి అనిల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొంతి సుదర్శన్ రెడ్డి, టి పిసిసి అధికార ప్రతినిధి కుచన రవళి, జిల్లా ఎస్.సి. సెల్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, మాజీ కార్పోరేటర్ తోట వెంకన్న, జిల్లా కిసాన్ ఖేత్ చైర్మన్ బి దేవేందర్ రావు, శక్తి యాప్ జిల్లా అద్యక్షుడులు పిన్నింటి అనిల్ రావు, గ్రేటర్ వరంగల్ ఉపాధ్యక్షులు మేకల ఉపేందర్, పల్లె రాహుల్ రెడ్డి, జిల్లా మరియు నగర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, మండల పార్టీ/ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు, డివిజన్ అద్యక్షులు, యూత్ కాంగ్రెస్ ఎన్.ఎస్.యు.ఐ అంబంధ సంఘాల అద్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.