దంతాలపల్లి: మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినేలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనబొమని చెప్పిన దానికి నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపుమేరకు రాష్ట్రమంతటా అన్ని మండల కేంద్రాలలో మోడీ దిష్టి బొమ్మకు పాడే గట్టి ఊరేగింపుతో, చావు డబ్బులతో, గంగిరెద్దుల ఆట పాటలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ధర్మవరపు వేణు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇదే విధముగా కేంద్రం కళ్ళు తెరిపించే రీతిన రైతుల నిరసన బీజేపీ సర్కార్ కు కనిపించాలని కూడా అన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులే కాదు.. ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి డైరెక్టర్ ఓలాద్రి మల్లారెడ్డి, పి ఎ సి ఎస్ చైర్మన్ సoపేట రాము, టిఆర్ఎస్ నాయకులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, వీరబోయిన కిషోర్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు రైతులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.