#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను సవరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పార్టీ మునగాల మండల కమిటీ సమావేశం మాధవరంలో బట్టు నాగయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఉపాధి హామీ చట్టంకి నిధులు తగ్గించిందని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని అన్నారు సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల, ఆధ్వర్యంలో శుక్రవారం మండల ముందు జరుగు నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వర రావు, మండల కార్యదర్శి చంద చంద్రయ్య, మండల కార్యవర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, ఎస్కే సైదా, జూలకంటి విజయలక్ష్మి, వీర బోయిన వెంకన్న, మండల కమిటీ సభ్యులు గోపయ్య, మంగయ్య, కృష్ణారెడ్డి, సతీష్, వెంకట కోటమ్మ, రామకృష్ణారెడ్డి, పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.