కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి

*సాగు చట్టాలు రద్దు చేయాలి!!*
———————-=—–
(రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు మోకు కనకారెడ్డి, ఆదిసాయన్న, కాంగ్రెస్ జిల్లా నాయకులు M.లింగోజి లు హెచ్చరించారు)

సాగు చట్టాలు రద్దు చేయకపోతే అధికారంలో కొనసాగడం కష్టమని, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాస్తారోఖో నిర్వహించడం జరిగింది, ఆందోళన ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోతుందని రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు మోకు కనకారెడ్డి, ఆదిసాయన్న, లింగోజి లు తెలిపారు.

దివి: 06-02-2021 శనివారం రోజున జనగామ బస్టాండ్ చౌరస్తా నాలుగు కూడలి వద్ద రాస్తారోఖో జిల్లా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రైతు సంఘాల నాయకులు మోకు కనకారెడ్డి, ఆదిసాయన్న, లింగోజి లు పాల్గొని మాట్లాడుతూ రైతులు సాగు చట్టాలను మాత్రమే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారని, ఆందోళన ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. రైతుల కనీస అవసరాలైన మంచినీళ్లు, విద్యుత్, ఇంటర్నెట్ సేవలు నిలిపుదలతోపాటు, 4 నుండి 5 అడుగుల సిమెంట్ గోడ, 1.5 కీ.మీటర్ల పాటు బారికేడ్లు నిర్మాణం లాంటి చర్యల వల్ల నిరసనలను ఆపలేరని, నారు పెట్టె రైతులకు మేకులు పెడతారా అని విమర్శించారు. ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేస్తున్న రైతులకు వ్యతిరేకంగా స్థానికుల పేరుతో BJP తమ కార్యకర్తల ద్వారా చేయించిన దమనకాండను సాక్షాలతో బయట పెట్టినందుకు మన్ దీప్ పూనియా అనే పాత్రికేయుణ్ణి, అనేక మంది రైతులను అక్రమంగా తీయార్ జైల్లో పెట్టడం సిగ్గుచేటన్నారు. రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాల రద్దు కోసం దేశ రాజధాని సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై 2 నెలలుగా నోరు మెదపని భారతసినీ, క్రికెట్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా పాప్ గాయని రిహాన పై విరుచుకుపడటం, అది భారత అంతర్గత వ్యవహారమని ఇతరుల జోక్యాన్ని దేశ సార్వభౌమత్వానికి ముప్పుగానే పరిగణిస్తామని ట్వీట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేఖ చట్టాల రద్దు కోసం నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అవమానించడమేనని తెలిపారు. అటు కరోనా మహమ్మారి, ఇటు ఆర్ధిక మాంద్యం ఈ జంట సంక్షోభాల మధ్య చిక్కుకున్న ప్రజలకు పెద్ద ఎత్తున ద్రోహం చేసే రీతిలో ఈసారి కేంద్రం బడ్జెట్ ఉందని అన్నారు. కొద్దీ మందిగా ఉన్న సంపన్నులకు లబ్ది చేకూర్చేందుకు, జాతి సంపదపై వారి పెత్తనానికి అవసరమైన అన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాపర్తి రాజు, ఇర్రి అహల్య, p.ఉపేందర్, B.శేఖర్, m.జనార్దన్, ch.సోమన్న, D.శ్రీనివాస్, j.ప్రకాష్, md అజారోద్దిన్ లతో పాటు cpm, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.