కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గళమెత్తిన గిరిజన బిడ్డలు

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆదేశాల మేరకు ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గళమెత్తిన గిరిజన బిడ్డలు.

బీజేపీ అహంకార పూరిత ధోరణికి చరమ గీతం పాడక తప్పదు – ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.

గిరిజనుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి – ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.

బీజేపీ కుట్రపూరిత, కుటిల రాజకీయాలు మానుకోవాలి.తెలంగాణలో మీ ఆటలు సాగవు – ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.

జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్ల పెంపుదలకు ఆమోదం తెలపాలి – ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ఆమోదింపచేసి ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోరుతూ 2017 లోనే సమర్పించినప్పటికీ, ఎన్నోమార్లు ముఖ్యమంత్రి గారు లేఖలు రాసి కోరినప్పటికీ, ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించ లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం అబద్దాలు చెప్పడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆదేశానుసారం ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని,గిరిజన సోదర సోదరీమణుల మనోభావాలను కించపరుస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించడం,అహంకార పూరిత ధోరణిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ కుటిల రాజకీయాలు మానుకోవాలని జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజెర్వేషన్ ప్రక్రియకు ఆమోదం తెలిపి వెంటనే అమలుచేయాలని లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని గిరిజన బిడ్డల ఆగ్రహ జ్వలలో కేంద్ర ప్రభుత్వం భస్మం కాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కాసాని వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ మల్లెల రాణి, మండల సమన్వయ కమిటీ సభ్యులు ఆనంతు సైదయ్య, ఎంపీటీసీలు శంకరశెట్టి కోటేశ్వరరావు, యరమాల క్రాంతి కుమార్,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు రమావత్ జబ్బార్,ఎస్సీ సెల్ అధ్యక్షులు కలకొండ బాలకృష్ణ, యూత్ అధ్యక్షులు అన్నెం వెంకట్ రెడ్డి,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ ఉద్దండు,గుడిపూడి శ్రీకాంత్, జిల్లా బోసుబాబు,భీమాల బ్రహ్మం, గ్రామశాఖ అధ్యక్షులు మహమ్మద్ సలీం,దాసరి వీరబాబు,చంధ్యా,పొట్టా కిరణ్,,కామిశెట్టి నర్సింహారావు,జమ్మల మూడి నారాయణ,శేషు,కంచుగంటి గోపి,పాలడుగు నాగరాజు,బిక్షం,తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.