రాష్ట్రప్రభుత్వ హామీల అమలుపై ఉద్యమిద్దాం
Citu జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దం. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు కోసం ఉద్యమించాలని citu జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న అన్నారు.
బుధవారం చీట్యాల ఐలమ్మ స్మారక భవనంలో ప్రజా సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రవీణ్ అధ్యక్షత వహించగా. సోమన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే విధంగా దేశ సంపదను ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెడుతున్నారని అన్నారు. అందులో భాగంగానే నిత్యవసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయన్నారు. మరోవైపు దేశంలో నిరుద్యోగం పేదరికం పెరిగిందన్నారు. చదువుకున్న వారందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి వెంకన్న, డి సోమన్న, ఎం మహేందర్, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
