కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా

ఈరోజు కోదాడ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు గింజుపల్లి రమేష్ గారి అధ్యక్షతన గిరిజనుల12శాతం రిజర్వేషన్ మీద కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి తీరుకు నిరసనగా అనంతగిరి మండలంలో గిరిజన సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని ధర్నా చేయడం జరిగింది.కేసీఆర్ గారు గిరిజనులకు ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా 2017 అసెంబ్లీ సమావేశాల్లో గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ను ప్రతిపాదిస్తు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది.అయితే దానికి విడ్డురంగా నిన్న పార్లమెంటులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదం చేయలేదు అని చెప్పడం ఎంత దుర్మార్గపు ఆలోచన చేసింది.గిరిజనులకు అయోమయం చేస్తున్నా ప్రతి పక్షాలు నిమ్మకు నీరేత్తనట్టుగా వ్యవహరిస్తున్నారు.అసలు బీజేపీ ప్రభుత్వం ST లకు 12శాతం రిజర్వేషన్ను బేషరతుగా ఆమోదించాలి అని గిరిజనుల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది.ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు,మండల పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు వెంపటి వెంకటేశ్వరరావు,మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్,చిలకముడి విశ్వేశ్వరరావు,స్థానిక సర్పంచ్ వెనేపల్లి వెంకటేశ్వరరావు,మండల పార్టీ ఉపాధ్యక్షులు బాణావతు శరణ్ నాయక్,లింగా రాజేశ్వరరెడ్డి(రాఘవరెడ్డి),కార్యదర్శి మాగి యాకోబు రామినేని పూర్ణచందర్రావు కొల్లు సుబ్బారావులు మద్దతు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో TRS మండల ST సెల్ అధ్యక్షులు గుగులోతు శ్రీనివాస్,గిరిజన నాయకులు,భూక్యా నాగరాజు,భూక్యా కోటేశ్వరరావు,భూక్యా రవి,బాణావతు వెంకటేశ్వర్లు, శ్రీనుబాబు,అజ్మిరా శ్రీను,పానుగోతు రాధాకృష్ణ,ధారావతు రామకృష్ణ,భూక్యా నాగరాజు భార్గవ్,శంకర్,అవినాష్,నగేష్,ధారావతు సుబ్బారావు మరియు గిరిజన నాయకులు,గిరిజన సోదరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.