కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి
ఈ నెల 28 న ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిల్లీ రైతులకు మద్దతుగా దీక్ష
కార్పొరేట్ కంపెనీలో తో కూమ్మకై న మోడీ
రైతులను దగా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
రైతు దీక్ష ను విజయవంతం చెయ్యండి
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు అని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేయడం విరమించుకోవాలని రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని
ఢిల్లీ అన్నదాతల అలుపెరుగని పోరాటం లో రైతులు చనిపోతున్న కేంద్రం రైతుల పట్ల వివక్షత కనబరుస్తూ ఉందని 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ హర్యానా రైతులంతా ఉద్యమిస్తున్నారు ఆందోళన కొనసాగుతూ 50 రోజులు గడిచాయి ఎముకలు కొరికే మంచు మంచు దెబ్బను పగటిపూట ఎండ దెబ్బను అకాలంగా కురిసిన వర్షాల ఇబ్బంది పెట్టుకుంటూ మొక్కవోని దీక్షతో అన్నదాతలు అంతా పిడికిలి బిగించారు ఇప్పటి వరకు 57 మంది అన్నదాతలు మరణించారు పదుల సంఖ్యలో రైతులు అనారోగ్యం పాలయ్యారు ప్రభుత్వం తో రైతులకు ఇప్పటివరకు పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని విరమించమని రైతు సంఘాలు స్పష్టం చేస్తుంటే సవరణల కే తప్ప చట్టాలను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని
ఇటు రాష్ట్రం లో కెసిఆర్ దేశం లో మోడీ ఒక్కటే అని డిల్లీ పర్యటన తరువాత మాట మార్చిన ముఖ్య మంత్రి కెసిఆర్ కు రైతులు రాబోయే రోజుల్లో గుణ పాఠం చెప్పటం కాయం అని
ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని, చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు ఉన్నాయని, దేశంలో 80% చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని దేశములో రైతులు పండించిన పంటను ఎక్కడైన అమ్ముకోవచ్చని అంటున్నారు కానీ దాని వల్ల కార్పొరేట్ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవారు మరియు భూస్వాములు మాత్రమే లాభ పడుతారు తప్ప పేద, మధ్య తరగతి చిన్న రైతులు నష్టపోతారని అన్నారు. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించకపోతే దళారుల చేతిలో రైతులు నష్టపోవాల్సి వస్తుందని తెలియజేసారు. అలాగే రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బాగు కొరకు కాకుండా దళారులను, కాంట్రాక్టర్లను పెంచి పోషించడానికి కొత్త చట్టాలు అమలు చేస్తున్నారని వెంటనే అమలు చేసిన కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలనీ అన్నారు. రైతుకు ప్రోత్సాహకర గిట్టుబాటు ధర కల్పించకపోగా
ఇప్పుడు రైతులను మోసం చెయ్యడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
చేన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిలి రవి,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, కొండం రవీందర్ రెడ్డి,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్రమౌళి
యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సిద్దం రాఘవేంద్ర,మామిడి శెట్టి కోటి
తదితరులు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.