janagama news citu news telugu news

ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకుల పిలుపు
జనగామ జిల్లా కేంద్రంలో గత ఎనిమిది సంవత్సరాలుగా అధికారాన్ని చలాయిస్తున్న బిజెపి ప్రభుత్వం తను చేస్తున్న నిర్వాకాలవల్ల అన్ని తరగతుల ప్రజానీకం అవస్థల పాలవుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం దాపురించిందని తెలంగాణ రైతు సంఘం నాయకులు మోకు కనకారెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి వెంకటరాజo లు అన్నారు.
ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వీరు పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న బిజెపి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు సైతం తీసివేసే ప్రైవేటీకరణ విధానాలు అవలంబించడం వల్ల ప్రభుత్వం రంగం దివాలా తీసింది అని, దీంతో దేశంలో కుబేరుల సంఖ్య పెరిగిందని, ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు అప్పనంగా సంపదను కట్టబెడుతూ దేశాన్ని అప్పులపాలు చేస్తున్నారని విమర్శించారు.
రైతాంగo దీర్ఘకాలం చేసిన పోరాటం ఫలితంగా దొడ్డి దారిన తీసుకొచ్చిన నల్ల చట్టాలను క్షమాపణ కోరి వెనక్కి తీసుకున్నప్పటికీ తిరిగి అదే పథకాలను తీసుకొచ్చే కుతిలయత్తనాలు బిజెపి చేస్తున్నదని, రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నదని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అభివృద్ధి పరిచి, పట్టణ ప్రాంత పేదలకు కూడా వర్తించేటట్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ధరలు తగ్గించాలని, విద్య వైద్యం కార్పొరేట్కరణను ఆపాలని, రైతాంగం రునాలను మాఫీని చేయాలని, లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణ ను ఆపాలని, కనీస వేతన చట్టాన్ని పకడ్బందీగా అమలు జరపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పై డిమాండ్ల సాధనకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరిగే పోరాట కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి ఆహల్య, వ్యాకసా జిల్లా నాయకులు పి. ఉపేందర్, బూడిద గోపి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా చందు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మ బిక్షం, సిఐటియు నగర కార్యదర్శి జోగు ప్రకాష్, పట్టణ పేదల సంఘం నాయకుడు కళ్యాణం లింగం, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాలే వెంకట మల్లయ్య, నాయకులు గంగాపురం మహేందర్, డివైఎఫ్ఐ నాయకులు విష్ణు, గిరిజన సంఘం జిల్లా నాయకుడు లావుడియా అనిల్ చౌహన్,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.