కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి ని కలిసి ఎమ్మెల్యే సీతక్క

కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారిని కలిసి ములుగు నియోజక వర్గ సమస్యలు వివరించి వినతి పత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
అడవి గ్రామాల అభివృద్ది కి సహకరించాలి
ఈ రోజు చెల్పుర్ జెనుకో గెస్ట్ హౌస్ లో జరిగిన నితి అయోగ్ సమావేశానికి హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని కలిసి ములుగు నియోజక వర్గ సమస్యలు వివరించి వినతి పత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ములుగు ట్రైబల్ యూనివర్సిటీ పనులు ప్రారంభిoచాలి,ఈ విద్యాసంవత్సరం నుండి తరగతులు ప్రారంభిమాచాలి
2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పొడుభూములకు పట్టాలు ఇవ్వాలి, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు మరియు అక్రమ కేసులు పెట్టి బయబ్రతులకు గురి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఫారెస్ట్ అధికారులకు ఇచ్చే కంపా నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని
అడవి గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి దీని ద్వారా అడివి గ్రామాలలో రోడ్లు, వ్యవసాయానికి 3 ఫెజ్ కరెంట్ ఇవ్వాలి, గిరి వికాస బోర్లకు పర్మిషన్ ఉన్న ఫారెస్ట్ అధికారుల అడ్డంకులను అపి గిరి వికాస బోర్లకు పర్మిషన్ ఇవ్వాలి
అడవి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
ఆదిలాబాద్ తరహాలో ఇప్పపువ్వు లడ్డు తయారి కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక యువత కు ఉపాధి అవకాశాలు కల్పించాలి
ములుగు నియోజకవర్గం లో అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను పెంచాలి అని కోరుతూ లేఖ అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.