కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలను విమర్శించిన గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు, కేంద్రం డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ పెంచితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేనేం తక్కువ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీలు బస్సు చార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం మీద అ కేంద్ర ప్రభుత్వం ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ సుంకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకొని కేంద్రం లాగానే పని వేయాలి కానీ ఏ సుంకాన్ని తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఈ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లమీద రాస్తారోకోలు ధర్నాలు చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలపై మోసపూరిత వాగ్దానాలు చేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఈ రెండు ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నారు, కాబట్టి ప్రజలారా వీరికి రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్ప కాయల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి దూడ పాక శంకరన్న,మండల ప్రధాన కార్యదర్శి పత్తి తిరుపతి,మండల నాయకులు కిష్టయ్య, మేకల బిక్షపతి, కాశిరెడ్డి రాజయ్య, రేగొండ గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లె పెళ్లి చంద్ర మొగిలి, కనకం రమేష్,జోరు సుదర్శన్, ఎండి అస్లాం భాష, ఏనుగు రవీందర్ సదానందం రెంటాల,ఎడ్ల శ్రీనివాస్, ఏనుగు రవీందర్, కొలిపాక సాంబయ్య, కూతురు దేవేందర్, ప్రసంగి,రంగయ్యపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు చిలువేరు సాంబయ్య, గడ్డం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.